వైకాపా కు షాకిచ్చిన సికే బాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
        దివంగత సి.ఎం వైఎస్.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి శిష్యుడు సికే బాబు. అసలు పేరు సికే జయ చంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు తిరుగులేని నేత. ఆయన్ను హతమార్చేందుకు ప్రత్యర్థులు చాలా సార్లు దాడులు చేశారు. కత్తులు దాడి చేయడమే కాదు..బాంబులు విసిరినా చివరి నిమిషంలో తప్పించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పై జరిగిన దాడులు ఒక సంచలనమే. ల్యాండ్ మైన్స్ పెట్టినా…దగ్గరుండి తుపాకులతో కాల్చిన బయట పడటం మాములు విషయం కాదు. అలాంటి నేతకు ఇప్పుడు జగన్ వర్గీయుల నుంచి అవమానం ఎదురైంది. అందుకే రగిలిపోతున్నారట సీకే బాబు. 
       చిత్తూరు రాజ‌కీయాల్లో సీకే బాబు యువ నాయకుడిగా అడుగు పెట్టారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా గెలిచి పట్టు సంపాదించారు. ఆ తర్వాత 1989లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. 1994, 1999లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో ఎన్టీఆర్ టైంలో తెలుగుదేశం హావా సాగింది. అయినా సీకే బాబు చిత్తూరులో గెలిచి తన సత్తా చాటాడు. 2004లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వక పోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో మళ్లీ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా రేసులో నిలిచి గెలిచారు. ఆయన మీద అనేక కేసులు ఉండటంతో మంత్రి పదవి రాలేదు. కాకపోతే సీకే బాబుకు బాగానే ప్రాధాన్యత ఉండేది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీకే బాబు వర్గం ఓడింది. సీకే బాబు భార్య లావణ్య వార్డు సభ్యురాలిగానే గెలవలేక చేతులెత్తిసిన పరిస్థితి. 
       సీకే బాబుకు సీటు ఇవ్వకుండా జంగాలపల్లి శ్రీనివాసులుకు జగన్ టిక్కెట్ ఇచ్చారు. ఫలితంగా సీకే అసలు ఎన్నికల్లో పాల్గొనకుండా మౌనం దాల్చారు. ఇప్పుడు తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన చేస్తున్నారు సీకే బాబు. వైఎస్‌కు తామే నిజ‌మైన రాజకీయ వార‌సులం అని ఇటీవల ప్రకటించాడు సీకే బాబు. సీకే కుటుంబానికి వైసీపీతో ఎటువంటి సంబంధమూ లేదని పార్టీ ప్రకటించింది. దీంతో సీకే బాబు రగిలిపోతున్నాడు. ఇండిపెండెట్‌గా పోటీ చేసి అయినా వైసీపీకి తన సత్తా చాటాలని చూస్తున్నారు ఆ నేత. అదే జరిగితే వైసీపీకి ఇబ్బంది జరగడం ఖాయంగా కనిపిస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*