పద్మ భూషణ్ రేసులో సింధు



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలుగు తేజం పీవీ సింధు ఇక పద్మభూషణ్ పీవీ సింధు. పద్మ భూషణ్ పురస్కారానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పీవీ సింధు పేరును సిఫారసు చేసింది. రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన సింధు ప్రతిష్టాత్మక సూపర్ సిరీస్ లలో విజయాలు సాధిస్తూ వస్తోంది. మహిళల బ్యాడ్మింటన్ లో అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ తెలుగు తేజంను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా ఓపెన్ 2017లో స్వర్ణం, కొరియా ఓపెన్ 2017లో స్వర్ణం, చైనా ఓపెన్ 2016లో స్వర్ణం, రియో ఒలింపిక్స్ 2016లో రజతం, దక్షిణాసియా క్రీడలు 2016లో కాంస్యం సాధించింది సింధు. 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు సింధును వరించాయి. 
        పీవీ సింధు డిప్యూటీ కలెక్టర్‌ గా ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సిఎం చంద్రబాబునాయుడు నుంచి డిప్యూటీ కలెక్టర్‌గా నియామక పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయినా తన తొలి ప్రాధాన్యత బ్యాడ్మింటన్‌కేనన్నారు. తాను క్రీడలపై ఎక్కువ దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సింధు బాగా రాణించి భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అమరావతిలో పీవీ సింధుకు వెయ్యి గజాల స్థలం, రూ.3 కోట్ల నగదును కేటాయించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ స్టార్ షట్లర్ పీవీ సింధుకు 1000 చదరపు గజాల స్థలం కేటాయింపు పత్రాలను ప్రగతి భవన్‌లో అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సింధుకు మరో పురస్కారం రానుండటం తెలుగు వారికి గర్వకారణం. సింధుకు హ్యాట్స్ ఆఫ్ చెబుతోంది నమస్తే ఆంధ్రా.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*