రజనీపై నోరు జారిన కమల్



Want create site? Find Free WordPress Themes and plugins.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ ను మాటలతో చంపేస్తున్నాడు విలక్షణ నటుడు కమల్ హాసన్. పార్టీ పెట్టక ముందే ఇలా ఉంటే ఇక అది పెట్టాక ఎలా ఉంటుందో మరి. రజనీ తమ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తానని చెప్పిన కమల్ ఇప్పుడు మాట మార్చారు. బీజేపీకి తన కంటే రజనీకాంతే బాగా సూటవుతాడని చెప్పారు. అదే సమయంలో తాను హేతువాదినన్నారు. పార్టీ పెట్టే విషయం ఎప్పుడనేది చెప్పకపోయినా.. కొత్త ఏడాదిలోపే ఉంటుందన్నాడు. పార్టీ ఏర్పాటుపై సీనియర్ల సలహాలు తీసుకుంటున్నానని తెలిపాడు. కేజ్రీవాల్‌ తన దగ్గరకి వచ్చారని, అది కేజ్రీ గొప్పతనమని కమల్ అన్నాడు. తాను కులాలకు వ్యతిరేకం అని స్పష్టంచేశాడు. డీఎంకే, ఏఐఏడీఎంకే రెండు పార్టీలు అవినీతికి పాల్పడినవేనని చెప్పారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని కమల్ తేల్చి చెప్పాడు.
                 ప్రధాని మోదీని వదల్లేదు కమల్. తమిళనాడుకు ఇంకా అచ్చే దిన్ రాలేదు. మిగతా రాష్ర్టాలతో నాకు సంబంధం లేదు కానీ.. అచ్చే దిన్ ఎప్పుడొస్తాయి అని కమల్ ప్రశ్నించాడు. నాకు నా దేశం అంటే ప్రేమ. అయితే అది ముందు నా ఇంటి నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత రాష్ట్రం. ప్రస్తుతం నార్త్, సౌత్ మధ్య కచ్చితంగా ఓ విభజన రేఖ ఉంది. ఢిల్లీకి తమిళనాడు అర్థం కాదు. తమిళనాడుకు ఢిల్లీ అర్థం కాదు. అందుకే తమిళనాడులో జాతీయ పార్టీలకు చోటు లేదని చెప్పారాయన. రజనీ నాకు స్నేహితుడు. రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు ముందు అతనికే చెప్పాను. ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్స్ లేవు. కానీ రజనీతో కలిసి పనిచేస్తా. ఇక రజనీకి ఉన్న మతపరమైన విశ్వాసాలను చూస్తే బీజేపీకి సూటవుతాడు. నేనో హేతువాదిని అని కమల్ చెప్పాడు. తమిళ రాజకీయాల్లో ఇప్పుడు శూన్యత ఉంది. అందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారాయన. ఇంత హడావుడి చేసే కమల్ ను జనాలు పట్టించుకుంటారా అనే అనుమానం వస్తుంది. విజయ్ కాంత్ లా పక్కన పెడితే కమల్ పరిస్థితి ఏంటో అనే వాదన సాగుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*