పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం



Want create site? Find Free WordPress Themes and plugins.
జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అంత‌ర్జాతీయ పుర‌స్కారం వ‌రించ‌నుంది. ఇండో యూరోపియ‌న్ బిజినెస్ ఫోరం ఎక్స‌లెన్స్ అవార్డుకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంపికయ్యారు. ఈమేర‌కు న‌వంబ‌రు 17న బ్రిట‌న్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో జ‌రిగే ఇన్వెస్ట్ ఈజ్ న్యూ ఇండియా స‌భ‌లో ప‌వ‌న్‌కు పుర‌స్కారం ఇవ్వనున్నారు. సామాజిక సమస్యల పరిష్కారంలో పవన్ చూపిన చొరవకు గుర్తింపుగా ఆ అవార్డు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అవార్డు విషయాన్ని జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 
                     వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ప్రతి ఏటా ఐఈబీఎఫ్ అవార్డును ఇవ్వడం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాది మంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్ చూపిన చొరవ ప్రశంసనీయం. మరోవైపు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న తీరు, సుసంపన్నమైన సమాజ స్థాపన కోసం ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుకు పవన్ కల్యాణ్ ని ఎంపిక చేసినట్టు ఐఈబీఎఫ్ ఇండియా విభాగం ప్రతినిధులు పేర్కొన్నారు. 
                   పవన్ కల్యాణ్ కి ఐఈబీఎఫ్ లీడర్ సునీల్ కుమార్ గుప్తా, కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కలిసి ఈ విషయం చెప్పారు. ఈ పురస్కారాన్ని లండన్ లోని బ్రిటన్ పార్లమెంట్ లో జరగనున్న ఇన్వెస్ట్ ఇన్ న్యూ ఇండియా సభలో పవన్ కు అందజేయనున్నట్టు తెలిపారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*