22 కిలోల చీర చూశారా…



Want create site? Find Free WordPress Themes and plugins.
గణేష్ ఉత్సవం అంటే ముంబై, హైదరాబాద్ లు, దసరా అంటే కోల్‌కత్తా నగరాలు గుర్తుకు వస్తాయి. ఆ ప్రాంతాల్లో ప్రజలు అంత గొప్పగా  పండుగలను జరపడమే ఇందుకు కారణం. కానీ పశ్చిమ బెంగాల్‌లో దుర్గామాత మండ‌పాల‌ను అలంకారాల్లో వినూత్న దృశ్యం సాక్ష్యాత్కరించింది. కోల్‌కత్తాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లండన్‌ థీమ్‌తో మండపం ఉండగా.. అమ్మవారి అలంకరణ దేశంలోనే మరెవరు పోటీకి రాలేనంతగా తయారైంది. బంగారంతో తయారు చేసిన చీర అమ్మవారికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయ పూజా కమిటీ దుర్గామాత కోసం దాదాపు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్‌ ఈ చీరను డిజైన్‌ చేశారు. 50 మంది నిపుణులు ఈ చీర తయారీకి శ్రమించారు. పువ్వులు, పక్షులు, సీతాకోక చిలుకలు, నెమళ్ల బొమ్మలతో పాటు.. హిందూ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా చీరపై ఎంబ్రాయిడరీ చేశారు. అద్భుతంగా ఉంది అమ్మవారి చీర. ఈచీర తయారీ చేసే వారు నియమ, నిష్టలను పాటించడం విశేషం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*