బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే



Want create site? Find Free WordPress Themes and plugins.
      తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో మరికొద్ది గంటల్లో ముగియనుంది. బిగ్‌బాస్ టైటిల్ ఎవ‌రిది అనే తేలనుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. బిగ్ బాస్ షో విన్నర్ ఎవరనేది. 70 రోజుల ఉత్కంఠ‌కు తెర ప‌డే స‌మ‌యం దగ్గర పడటమే ఇందుకు కారణం. ప్లీజ్ ఓట్ ఫ‌ర్‌ అర్చ‌నఅంటూ హైద‌రాబాద్‌లోని ప‌లు ఏరియాల్లో అర్చ‌న భారీ క‌టౌట్స్ వెలిశాయి. ప్ర‌సాద్ ఐమాక్స్, అమీర్‌పేట, శంషాబాద్ ఎయిర్ పోర్టులలో భారీ సైజ్‌లో వెలిసిన క‌టౌట్స్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. జై ల‌వ కుశ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ఐమాక్స్ ద‌గ్గ‌ర వెలిసిన అర్చ‌న కటౌట్ ఎన్టీఆర్  ఫ్యాన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. ఈ క‌టౌట్‌లో జై ల‌వ కుశ పోస్ట‌ర్ కూడా ఉంది. అంద‌మైన కెప్టెన్ అర్చ‌న‌కు ఓటేయాలంటూ అర్చ‌న ఫ్యాన్స్ అసోషియేష‌న్ కోరుతోంది. 
      బిగ్‌బాస్‌లో అర్చ‌న‌తో పాటు హరితేజ,  ఆదర్శ్, నవదీప్, శివబాలాజీ.. టైటిల్ కోసం నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నారు. మరోవైపు శివబాలాజీ సతీమణి ఫేస్ బుక్ లో వీడియో పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. లక్షల్లో దానికి లైక్స్ వచ్చాయి. ముమైత్ ఖాన్ తప్ప మిగతా వారంతా మరోసారి బిగ్ బాస్ షోకు వచ్చి పార్టీలో పాల్గొన్నారు. గత స్మృతులను నెమరేసుకుంటా ఆడిపాడారు. ఫలితంగా సందడిగా మారింది షో. ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఐదుగురుతో కుటుంబ సభ్యులను మాట్లాడించారు. 
        ప్రసాద్ ఐమాక్స్ ధియేటర్ వద్ద ప్రేక్షకులతో లైవ్ లో హౌస్ లో ఉన్న వారితో మాట్లాడించడం విశేషం. శివబాలాజీ కొట్టడం ఇష్టమేనా అంటూ ఓ ప్రేక్షకుడు అడిగితే…ప్రేమగా కొడతాడు కాబట్టి ఇబ్బంది లేదంటు హరితేజ సమాధానం చెప్పారు. ఇక ఎప్పుడూ మేకప్ వేసుకుంటూ ఉంటున్న అర్చనను కొంటె ప్రశ్న అడిగారు ఓ వీక్షకుడు. మేకప్ వేసుకుని సిమ్మింగ్ పూల్ లో దిగితే మేకప్ పోతుందని బాధపడలేదా అని అడిగారు. వాటర్ ప్రూప్ మేకప్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదని చెబుతోంది. నవదీప్ వచ్చాక ఆటలో మజా పెరిగిందని చాలా మంది అభిప్రాయపడ్డారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*