చంద్రబాబు మార్క్ కమిటీలు



Want create site? Find Free WordPress Themes and plugins.
       పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంత వారినైనా పక్కన పెడతాననే సంకేతాలిచ్చారు తెలుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, సి.ఎం చంద్రబాబునాయుడు. తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా అంటూ నానా హంగామా చేశారు బొజ్జల. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీడియా ముందుకు వచ్చారు. బొజ్జల సతీమణి అయితే మంత్రి గంటాను ఉతికి ఆరేశారు. మీరెవరు అసలు మా ఇంటికి రావడానికి అంటూ తిట్టిపోశారు. ఇప్పుడు బొజ్జలకు పార్టీ కమిటీలో చోటు ఇవ్వలేదు చంద్రబాబు. వ్యక్తులు ఎవరైనా పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని హెచ్చరికలు పంపినట్లు అయింది. ఆయనే కాదు…సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరికి చోటు దక్కలేదు. మంత్రి పదవి రాలేదనే కారణంగా సి.ఎంకు బహిరంగ లేఖ రాశారాయన. ఇటీవల కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతోను మంతనాలు జరిపారు. విషయం ఏదైనా గానీ ఆయన తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అందుకే పక్కన పెట్టారనే వాదనుంది. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాణమూర్తి అలానే గోల చేశారు. మంత్రి పదవి కోసం తనను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. అసలు కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. పార్టీ మీద అలిగి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా వెళ్లిన సంగతి తెలిసింది. అందుకే ఆయన్ను పక్కన పెట్టారని తెలుస్తోంది.  
         ప్రకాశం జిల్లాలో వైకాపా నుంచి టీడీపీలో చేరిన గొట్టిపాటి రవికుమార్ కు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు కరణం బలరాం కృష్ణమూర్తి. ఆయనకు అనేక సార్లు సర్ది చెప్పినా పద్దతి మార్చుకోలేదంటున్నారు. అందుకే ఆయనకు పార్టీ కీలక కమిటీలో చోటు ఇవ్వలేదు. ఇక విజయవాడలో వివాదస్పద పనులు చేసి వార్తల్లోకి ఎక్కే బొండా ఉమామహేశ్వరరావుకు కమిటీ స్థానం ఇవ్వలేదు. మంత్రి పదవి కోసం ఆయన ప్రయత్నించడమే కాదు..పార్టీని విమర్శించారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని అంశాలు పరిశీలించాకనే ఆయన్ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక  ఇది వరకు జాతీయ కమిటీలో ఉన్న పయ్యావుల కేశవ్, రాష్ట్ర కమిటీలో ఉన్న జేఆర్‌ పుష్పరాజ్‌ను ఏ కమిటీలోకి తీసుకోక పోవడం ఆశ్చర్యమే. 
       మరో పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారికి కొత్త కమిటీల్లో చోటు కల్పించారు చంద్రబాబు. నంద్యాల ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన మాజీ మున్సిపల్ ఛైర్మన్, ఎండీ నౌమాన్‌ను రాష్ట్ర కమిటీ ఉపాధ్యకునిగా నియమించడం ఆసక్తికరం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు, కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలను రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన జూపూడి ప్రభాకర్, ఆదిరెడ్డి అప్పారావు, కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరిన డొక్కా మాణిక్య వరప్రసాద్‌ వంటి నేతలకు రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. లోకేశ్‌ను జాతీయ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర అధ్యక్షునిగా కళా వెంకట్రావును తప్పించే ఆలోచన చేసినా చివరకు ఆయన్నే కొనసాగించారు. 
       మొత్తంగా కమిటీల్లో బాబు మార్కు స్పష్టంగా కనపడింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో నేతలకు బాగా అర్థమైంది. అందుకే దటీజ్ చంద్రబాబు అంటున్నారు అంతా. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*