టీడీపీ పొలిట్ బ్యూరో ఇదే



Want create site? Find Free WordPress Themes and plugins.
       తెలుగుదేశం పొలిట్‌బ్యూరో, జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభ్యుల వివరాలను మీడియాకు తెలిపారు. పార్టీ సీనియర్‌ నేతలతో సమావేశమై పలు విషయాల పై చర్చించాక వాటిని విడుదల చేశారు. పార్టీ పోలిట్‌బ్యూరోలో 17 మంది సభ్యులు ఉంటారని చెప్పారు. తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్కకు పొలిట్‌బ్యూరోలో చోటు దక్కింది. తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన రమేశ్‌ రాధోడ్‌ స్థానంలో సీతక్కకు స్థానం కల్పించారు. పోలిట్‌బ్యూరోలో ఇప్పుడున్న వారిలో మార్పులు చేయలేదు. 
      మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ కమిటీలో 105 మంది, తెలంగాణ కమిటీలో 114 మంది ఉంటారని చంద్రబాబు చెప్పారు. తెలంగాణ కమిటీకి ఎల్‌.రమణ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీకి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు కొనసాగనున్నారు. పార్టీ ఏపీ, తెలంగాణ అధ్యక్షుల మార్పు ఉంటుందని అనుకున్నా..ఆ పని చేయలేదు. కీలక మార్పులు లేకుండానే పార్టీ కమిటీలను ప్రకటించారు చంద్రబాబునాయుడు. త్వరలోనే పార్టీ అనుబంధ సంఘాలు, కమిటీలు ప్రకటించనున్నట్టు సీఎం వెల్లడించారు.
కొత్త పొలిట్‌బ్యూరో ఇదే.. 
1. అశోక్ గజపతిరాజు
2. యనమల రామకృష్ణుడు
3. నిమ్మకాయల చినరాజప్ప
4. కేఈ  కృష్ణమూర్తి
5. నందమూరి హరికృష్ణ
6. దేవేందర్ గౌడ్
7. కాలువ శ్రీనివాసులు
8. ఎలిమినేటి ఉమామాధవరెడ్డి
9. రేవంత్ రెడ్డి
10. మోత్కుపల్లి నర్సింహులు
11. రావుల చంద్రశేఖర్ రెడ్డి
12. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
13. ప్రతిభాభారతి
14. నామా నాగేశ్వరరావు
15. అయ్యన్నపాత్రుడు
16. రేవూరి ప్రకాశ్ రెడ్డి
17. సీతక్క…
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*