గోదావరిలో పీతల పితలాటకం



Want create site? Find Free WordPress Themes and plugins.
        మంత్రిగా అనేక వివాదాల్లో తలదూర్చారు పీతల సుజాత. తాను మీటింగ్ లకు వెళ్లక ముందే నజారానాలు రెడీగా ఉంచాలని అధికారికంగా హుకుం జారీ చేసేవారనే ఆరోపణలు వచ్చాయి. ఓ జిల్లాలో అయితే మంత్రి కోసం అధికారులు ఏకంగా వడ్రాణాలు, వంకీలు చేయించి పెట్టారనే ప్రచారం వచ్చింది. ఇలా చాలా చోట్ల ఆమె నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని తెలిసింది. చివరకు పంచాయితీ సి.ఎం చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లింది. అన్ని విషయాలను పరిశీలించిన చంద్రబాబు సైలెంట్ గా ఆమె పై వేటు వేశారంటారు. మంత్రి పదవి పోయిన తర్వాత కూడ పీతల దూకుడు తగ్గించలేదనేది తమ్ముళ్ల మాటగా ఉంది. 
         పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో మరోసారి రభస జరిగేందుకు ఆమెనే కారణం అయింది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలోనే ఎంపీ మాగంటి బాబు, పీతల సుజాత వర్గీయులు గొడవ పడ్డారు. ఎవరికి వారే వ్యతిరేకంగా నినాదాలు చేసుకునేంత వరకు విషయం వెళ్లింది. మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా దారికి రాలేదు. 
          పీత‌ల సుజాత‌కు చింత‌ల‌పూడి టిక్కెట్ ఇచ్చినప్పటి నుంచి గెలిచే వరకు అండగా నిలిచింది మాగంటి వ‌ర్గీయులే. కానీ గెలిచాక ఆమె అది మర్చిపోయారంటారు. మంత్రి పదవి వచ్చాక తనకు సాయ పడిన వారిని ఆమె పూర్తిగా మర్చిపోయారని…తమ వారిని దూరం పెట్టారనేది ఎంపీ వర్గీయుల వాదన. మంత్రి ప‌ద‌వి రావ‌డంతో ఆమె త‌న‌కంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. ఎంపీ వ‌ర్గానికి వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు.  ఫలితంగా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. వీరి గొడ‌వ‌ల‌తో పార్టీ అధికారంలోకి వ‌చ్చి మూడున్న‌రేళ్లు అవుతున్నా ఇంకా ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వి నియామ‌కం కాలేదు. 
         చంద్ర‌బాబు ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఇరు వర్గాలు ఫిర్యాదులు చేసుకుంటాయి. ఇటీవల పోల‌వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మ‌రోసారి మాగంటి వ‌ర్గం సుజాత పై ఫిర్యాదు చేసింది. దీంతో స‌మ‌స్య ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను మంత్రులు ప్ర‌త్తిపాటి, పితానికి అప్ప‌గించారు చంద్రబాబు. వారికి సర్ది చెప్పేందుకు ఇద్దరు మంత్రులు తమదైన శైలిలో పావులు కదిపినా దారికి రాక పోవడం హాట్ టాపికైంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*