సంక్రాంతికి ఎన్టీఆర్‌ గృహ ప్రవేశాలు



Want create site? Find Free WordPress Themes and plugins.
  
        ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగనున్నాయి. పేదల కోసం నిర్మించే భవనాల నిర్మాణం చాలా వరకు అప్పటికి పూర్తవుతోంది. ఫలితంగా లక్షలాది మంది సొంతింటి కలను నిజం చేసుకుని పండుగ చేసుకోనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అత్యధిక సంఖ్యలో ఇళ్లు నిర్మిస్తున్నసంగతి తెలిసిందే. సంపన్నుల ఇళ్లకు ధీటుగా పేదల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇళ్ల నిర్మాణ పురోగతిపై సిఎం చంద్రబాబు సమీక్షించి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. 
 
        ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం మరింత తొందరగా పూర్తి చేసి ఇవ్వాలని సి.ఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. నిర్మాణం పూర్తికాక వివిధ దశల్లో ఉన్న (బిబిఎల్, ఎల్ఎల్/ఆర్ ఎల్ గృహాలకు (ఐఏవై కాకుండా) ప్రీ ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద రూ. 25,000 వంతున అదనంగా కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 500 కోట్లు కేటాయిస్తూ మంత్రిమండలి గతంలోనే నిర్ణయం తీసుకుంది. ఎల్.ఎల్/ఆర్.ఎల్ కింద 1,15,801 మంది ప్రజలు లబ్ది పొందనున్నారు. 
          ఈ పథకం కింద మొత్తం లబ్దిదారుల సంఖ్య 2,93,909 మంది. బిబిఎల్/బి.ఎల్ కింద నిర్మాణంలో ఉండి నిలిచిపోయిన 1,77,514 గృహ నిర్మాణాలను పూర్తిచేయనుంది ప్రభుత్వం. ఎల్.ఎల్/ఆర్.ఎల్ కింద 85,222 గృహ నిర్మాణాల పూర్తి చేయడానికి ఈ సొమ్మును ఖర్చు చేస్తారు. మొత్తం 2,62,736 గృహ నిర్మాణాలు సంక్రాంతికి పూర్తి కానున్నాయి. బిబిఎల్/బి.ఎల్ కింద ఇప్పటికి గృహనిర్మాణాలు పూర్తయ్యాయి. ఎల్.ఎల్/ఆర్.ఎల్ కింద ఇప్పటికి 30,599 గృహాలు నిర్మించారు. అదనపు సొమ్ముతో గృహ నిర్మాణాలు పూర్తయితే ఇప్పటికే పూర్తిచేసిన గృహనిర్మాణాలతో 4 లక్షల ఇళ్లు పూర్తయినట్లు అవుతుంది. అదనంగా ఒక్కో ఇంటికి కేటాయించిన రూ. 25,000లతో 1,78,108 మంది లబ్ది పొందుతారు.
          చెప్పడం తేలికే. కానీ చేయడం కష్టం. కానీ లోటు బడ్జెట్ తో ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కారు పేదల ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్న తీరు చర్చనీయాంశమైంది. ఎక్కడా వెనక్కు తగ్గలేదు. పేదలను ఆదుకుంటు ముందుకు వెళుతున్న తీరు అభినందనీయం. కేంద్రం నుంచి మరింత మద్దతు లభిస్తే ఈపాటికి నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారేది. అయినా చంద్రబాబు తన శక్తి మేర పేదలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతికి రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే చంద్రబాబు ఇందుకు రూ. 5,556.74 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా 3,03,044 గృహాల నిర్మాణం సాగుతోంది. వచ్చే జూన్ నాటికి ఐదు లక్షల గృహాలు, అక్టోబరు 2న మిగిలిన ఇళ్లను పూర్తిచేసి గృహ ప్రవేశాలు జరపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పేదల గృహ ప్రవేశాలు సామూహికంగా ఒక పండుగలా జరిపేందుకు నిర్ణయించారు. ఆ గృహ సముదాయాలకు ఎన్టీఆర్‌ నగర్‌ అని పేరు పెట్టారు. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున గృహాలను నిర్మించే రాష్ట్రం మరోకటి లేదు. అంతగా పేదల గురించి ఆలోచిస్తున్న చంద్రబాబును కేంద్ర మంత్రులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.       
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*