హ్యాపీ వెడ్డింగ్ లో నిహారిక



Want create site? Find Free WordPress Themes and plugins.
 
       సినీ నటుడు నాగబాబు తనయ నిహారిక. ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగా హీరోయిన్ నిహారికకు ఆసినిమా ప్లాప్ రుచి చూపించింది. ఆ తర్వాత రెండో సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే నిహారిక హీరోయిన్‌గా మరో సినిమా ఓకే చేసిందట. యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ సినిమాకు హ్యాపీ వెడ్డింగ్ అనే టైటిల్ పెట్టారు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించనున్న ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. అక్టోబ‌ర్ 4 నుండి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కోసం అంచనాలు బాగానే ఉన్నాయి. లక్ష్మణ్ అనే ఓ కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిశ్రమకు పరిచయం కానున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు ఉంటారు. ఏంటనే విషయం పై పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*