రాటుదేలుతున్న లోకేష్Want create site? Find Free WordPress Themes and plugins.
         లోకేష్ కు సరిగా మాట్లాడటం రాదు. జయంతికి వర్థంతికి తేడా తెలియదనే విమర్శ ఉండేది. కానీ ఇప్పుడు ఆ మాటలను వెనక్కు తీసుకోవాల్సిందే. తప్పదు. పనితీరులోనే కాదు..ప్రసంగంలోను రాటుదేలారు. తన మాట తీరుతో శభాష్ అనిపిస్తున్నారు. విమర్శించిన వారితో నోటితోనే ఔరా అనిపిస్తున్నారు. ఇటీవల ఐఎఎస్ అధికారుల ముందు చేసిన ప్రసంగం అదుర్స్. పరిపాలన వ్యవస్థ గురించి చక్కని అవగాహన ఉన్న వారి ముందు సాగిన ప్రసంగ హోరు చూసి తీరాల్సిందే. ఎన్నో ఏళ్ల నుంచి సబ్జెక్టు మీద పట్టు ఉన్న వారు సైతం ఆశ్చర్యపోయేలా సాగింది మాటల ఒరవడి. ముఖ్యంగా ఏ విభాగంలో ఏం చేయాలి. ఎంత వరకు పనులు వచ్చాయి. ఏం చేస్తే బావుంటుందో వివరించిన తీరు చూస్తే ముచ్చటేస్తోంది.   
        గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం పై లోకేష్ మంచి పట్టు సంపాదించారు. ఐటీ అండ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ తాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించాడు. ఇందులో భాగంగా అలెర్ట్ మేనేజ్ మెంట్ సిస్టం  ద్వారా జలవాణి పేరుతో ఒక  కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయాలి. తాగునీటికి సంబంధించి ఎక్కడ సమస్యలు వచ్చినా దానికి కాల్ చేయవచ్చు. 
       ఎక్కడైతే సమస్య ఉంటుందో..సంబంధిత అధికారి లేక ఉద్యోగికి పంచాయితీరాజ్ శాఖ సమస్యను చేరవేస్తోంది. ఏ గ్రామంలో సమస్య ఉంటే ఆ గ్రామ అధికారి, మండల అధికారి, ఆపై అధికారికి సమాచారం చేరవేస్తారు. ఇది రిసీవ్ చేసుకున్న సంబంధిత అధికారి సమస్య ఉన్న గ్రామానికి వెళ్లి, ఫిర్యాదుదారుతో మాట్లాడి సమస్యని పరిష్కరించాలి. సమస్య పరిష్కరించినట్లు తాను డాష్ బోర్డ్ లో దృవీకరించాలి. అతనికి చేతగాక పోతే దీన్ని పైస్థాయి అధికారి నిర్ధారించుకుని పని ఎంత వరకు వచ్చింది. ఏంటనే విషయం పై సమాచారం చెప్పాలి.  
         పని పూర్తికాకపోయినా ఒక్కోసారి అధికారులు కంప్లీటెడ్ అని రాసే వీలుంది. అందుకే, ఫిర్యాదుదారుకి  కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తారు. అతని సమస్య సంతృప్తికరంగా పరిష్కారం అయిందా… లేదా అని అడుగుతారు. ఫిర్యాదుదారు గనుక తమ సమస్య పరిష్కారం కాలేదని చెబితే, టికెట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇలా రీఓపెన్ చేయాల్సిన కంప్లైంట్స్ ఏ జిల్లాలో ఎక్కువ ఉంటే ఆ జిల్లా అధికారులతో మంత్రి లోకేష్ స్వయంగా మాట్లాడతారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది.  
        ఫిర్యాదు చేసిన వారితో మాట్లాడిన తర్వాత వారిలో 40 శాతం మందే సంతృప్తికరంగా ఉన్నట్లు లోకేష్ తెలుసుకున్నారు. దీంతో అన్ని జిల్లాల అధికారులతో లోకేష్ సమీక్ష జరుపుతున్నారు. నిధుల కొరత ఉండడం వల్ల తాగునీటి సమస్య పరిష్కరించ లేకపోతున్నట్లు అధికారులు చెప్పారు. వెంటనే లోకేష్ మండలానికి రూ.2 లక్షల చొప్పున అత్యవసర నిధులు కేటాయించారు. ఫలితంగా వారం నుంచి 9 రోజుల వరకు సమస్య పరిష్కారం అయింది. ఆ తరువాత లోకేష్ వదిలి పెట్టలేదు. జలవాణి కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఫిర్యాదుచేసిన వారిలో 80 శాతం మంది తమ సమస్య సంతృప్తికరంగా పరిష్కారం అయిందని చెప్పడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 
         జలవాణి లో ఫిర్యాదుచేసినా ఇంకా పరిష్కారం కాని కొన్ని సమస్యలు ఉంటున్నాయి. నిధుల కొరత, ఇతర సాంకేతిక సమస్యలు, అధికారులు అందుబాటులో లేకపోవడం, సంబంధిత మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ లు లేకపోవడంతో అవి ఆగుతున్నాయి. ఉద్యోగులలో జవాబుదారీతనం పెంచడమే కాదు..ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్న లోకేష్ ప్లాన్ ను తల పండిన మేధావులు అభినందిస్తున్నారు. డాష్ బోర్డ్ రూపొందించిన తీరు అద్భుతంగా ఉందన కితాబునిస్తున్నారు. 
      అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంచాయతీరాజ్ డ్యాష్ బోర్డ్ తయారు చేసిన తీరును అధికారులకు చూపించారు లోకేష్. ఆయా శాఖల పరిధిలో జరుగుతున్న 40 రకాల పనుల పురోగతిని ఏ క్షణం కావాలంటే ఆ క్షణం ట్రాక్ చేసే విధంగా రూపొందించినట్లు చెప్పారు. తాను ఉద్యోగులు, అధికారులకు విధించిన లక్ష్యాలు, సాధిస్తున్న ఫలితాల ఆధారంగా రెడ్, ఆరంజ్, గ్రీన్ వంటి విభాగాలుగాను ఏర్పాటు చేశారు.  కలెక్టర్లు అంతా జిల్లాల వారీగా ఫలితాలు బేరీజు వేసుకుని పనితీరు మెరుగుపర్చుకోవడానికి ఈ డ్యాష్ బోర్డ్ ఉపయోగ పడుతుందని చెప్పారు.  
         గ్రామ సీమలో జరుగుతున్న అభివృద్ధి, సీసీ.రోడ్లు, ఎల్ఈడి లైట్లు, మరుగుదొడ్లు నిర్మాణం ఇలా అన్ని విషయాలను రియల్ టైమ్‌లో విశ్లేషించే విధంగా డ్యాష్ రూపొందించినట్టు తెలిపారు. తన డ్యాష్‌ బోర్డు సాయంతో ఆయా జిల్లాల్లో ఏం జరుగుతుందో గణాంకాలతో సహా చెప్పటంతో కలెక్టర్లు ఆశ్చర్యపోయారు. లోకేష్ ను గౌరవించే తీరులోను తేడా వచ్చింది. ఆ..ఏముందిలే లోకేష్ కు ఏం తెలుసు అనుకునే దశ నుంచి లోకేష్ కే తెలుసు అనే అంచనాకు అధికారులు రావడం మాములు విషయం కాదు. అందుకే ఇక మీదట లోకేష్ తో మీటింగ్ అంటే అన్ని గణాంకాలను చాలా జాగ్రత్తగా తీసుకుని..వెళ్లాలి. లేకపోతే ఇబ్బంది పడతామని వారు చర్చించుకోవడం కనిపించింది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*