సైకిల్ ఎక్కనున్న డిఎల్



Want create site? Find Free WordPress Themes and plugins.
       డిఎల్ రవీంద్రారెడ్డి. కడప జిల్లా నేత. మైదుకూరు నియోజకవర్గంలోని ఖాజీపేట మండలం సుంకేసుల సొంతూరు. వృత్తిరీత్యా డాక్టర్‌. ఖాజీపేటలో చాలాకాలం వైద్యవృత్తిని కొనసాగించారు. ఫలితంగా ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అందుకే డీఎల్‌ అసెంబ్లీకి పోటీ చేసి గెలిచాడు. 1978లోనే మైదుకూరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి ఘన విజయం సాధించారు డీఎల్‌. 1983లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీచింది. అయినా అతను తట్టుకుని నిలబడ్డాడు విజయభేరి మోగించాడు. 
         డిఎల్ ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. నాలుగు సార్లు మంత్రిగా పని చేశారు.  కడప జిల్లాలో మంచి పట్టున్న నేత. రాష్ట్ర విభజన తర్వాత అతను కాంగ్రెస్ ను వీడాడు. టీడీపీ వైపు మొగ్గు చూపాడు. కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ స్థానికంగా ఉన్నటీడీపీ నేతలతో ఆయనకు పొసగలేదు. అందుకే డిఎల్ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు డిఎల్ ను తీసుకువచ్చేందుకు యువనేత లోకేష్ చేసిన ప్రయత్నం ఫలించిందంటున్నారు. త్వరలోనే డిఎల్ టీడీపీ జెండా పట్టుకోనున్నాడు. తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మీదట క్రియాశీలకంగా వ్యవహరించనున్నట్లు సమాచారం.  
        మరోవైపు జగన్ పార్టీ నేతలు డిఎల్ తో డీల్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాలని మంతనాలాడారు. పార్టీ ఏర్పాటు చేసిన కొత్తలో కడప ఉప ఎన్నికల్లో జగన్ తో పోటీపడ్డాడు డిఎల్. కానీ ఆసంగతిని మర్చిపోయి పార్టీలోకి ఆహ్వానించడం ఆసక్తికరమే. జగన్ పాదయాత్ర మొదలుపెట్టక ముందే డిఎల్ ను పార్టీలో చేర్చుకునే అంశం పై బాగానే పావులు కదుపుతున్నారు. కానీ డిఎల్  అంత ఆసక్తి చూపడం లేదని తెలిసింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. అందుకే జగన్ పార్టీ నేతల ఆహ్వానం పైనా ఆయన సమాలోచనలు చేస్తున్నారు. మైదుకూరులో నాలుగు సార్లు గెలిచిన డిఎల్..మరో రెండు సార్లు ఓడిపోయారు. మైదుకూరులో గట్టి నేత లేని లోటు తీరుతుందని జగన్ భావిస్తున్నాడట. అందుకే డిఎల్ ను ఆహ్వానిస్తున్నారంటున్నారు. 
         వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి నేతలంతా భయపడేవాళ్లు. కానీ డీఎల్‌ రవీంద్రారెడ్డి ఓపెన్‌గానే వైఎస్‌ఆర్‌ను విమర్శించేవారు. జలయజ్ఞం పేరుతో జరుగుతున్న స్కాముల గురించి ఆరోజుల్లో బయటకి మాట్లాడిన స్ట్రాంగ్ లీడర్. యనమల వియ్యంకుడు సుధాకర్‌యాదవ్‌ అక్కడ పార్టీ వ్యవహారాలను చూస్తున్నా..డిఎల్ ను తీసుకునేందుకే లోకేష్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వైఎస్‌ నే కాదు…కిరణ్‌కుమార్‌ రెడ్డితోను డిఎల్ కు సరిపడలేదు. తప్పు ఉంటే ఎవరినైనా కడిగి పారేసే ధైర్యం ఉంది. అందుకే ఆయన కోసం రెండు పార్టీలు పావులు కదుపుతుండటం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*