బాబుకు అండగా కేంద్ర మంత్రులు Want create site? Find Free WordPress Themes and plugins.
        చంద్రబాబు పాలన తీరు అద్భుతం. తెలుగువారే కాదు..మిగతా వాళ్లు ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. పలువురు ప్రముఖులు చంద్రబాబు తీరును ప్రశంసిస్తున్నారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చంద్రబాబు పాలన తీరుచాలా బాగుందని చెప్పిన సంగతి తెలిసిందే. లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అదే మాట చెప్పారు. మినిమమ్ గవర్నమెంట్ మాగ్జిమమ్ గవర్నెన్స్ పథకం చాలా బాగుందని కిరణ్ బేడీ బాబుకు కితాబునిచ్చారు. 1100 కాల్ నెంబర్ ద్వారా ఫిర్యాదులు తీసుకోవడం పరిష్కారం చూపడం చాలా బాగుందన్నారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఆమె ప్రస్తావించారు. కేంద్ర మంత్రి ఉమా భారతి, బీహార్ డిప్యూటీ సి.ఎం  సుశీల్ మోడీ చంద్రబాబు పాలనచూసి ముచ్చట పడుతున్నారు. 
         గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రపంచంలోనే అపర కుబేరుడు బిల్ గేట్స్, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, మాజీ ప్రధాని వాజ్‌పేయిలు చంద్రబాబు పరిపాలన తీరు చూసి ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ ను ఐటీలో, ఫార్మాలో ప్రధమ స్థానానికి తీసుకెళ్లిన సంగతిని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇలానే చంద్రబాబు పాలనకు కితాబునిచ్చిన సంగతి తెలిసిందే. పరిశోధనల్లో శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి చంద్రబాబు ఇచ్చిన కోటి రూపాయల ప్రకటన స్ఫూర్తి నింపుతుందని నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. 
         ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ఇంత అద్భుతంగా చేయవచ్చా  అని అమరావతి రాజధాని శంఖుస్థాపన పై కాలిపోర్నియా నగర మేయర్ బిల్ హారిజన్ అన్న సంగతి తెలిసిందే. పకృతి విలయాల పై చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను తమిళ పత్రికలు ప్రశంసించాయి. ఇండియాలో చంద్రబాబు అనే సీఎం ఉండేవారు. ఆయన ఐటీ రంగాన్ని ఎంతో ప్రోత్సహించి ఎందరో యువతకు మంచి లైఫ్ ఇచ్చారని పాకిస్తాన్ మీడియాలో చర్చ జరిగింది. చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు కురిపించారు.  
       ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌ేందుకు ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారన్నారు కైలాష్ లాంటి మేధావులు. కేంద్రమంత్రుల్లో చాలామంది చంద్రబాబు పాలన తీరుకు పడిపోయారు. ఆయన డైనమిక్ గా పని చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే చంద్రబాబును మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంటారు. పీయూష్‌ గోయల్‌ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అవగానే ఏపీకి 24 గంటల విద్యుత్‌ సరఫరా చేసే పైలెట్‌ ప్రాజెక్టు మంజూరు చేశారు. దేశం మొత్తం మీద రెండు రాష్ట్రాలకే ఇలాంటి పని చేయగా..ఒకటి ఏపీ. కేంద్ర మంత్రి ఉమాభారతి జలవనరుల శాఖలో పెండింగ్ పనులన్నింటినీ క్లియర్ చేసేవాళ్లు. ఉమ భారతి తర్వాత వచ్చిన ఆర్ కే సింగ్ చంద్రబాబు పాలన సంగతి తెలుసుకుని ఉద్యోగులకు ఆ మాట చెప్పారట. లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఉన్నా…కేంద్ర మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు నిధులను సమకూర్చేలా సహకరించేవారు. వెంకయ్య ఉప రాష్ట్రపతి అయ్యాక ఆ లోటు తీర్చలేనిది అయినా..మిగతా వారు చంద్రబాబుకు బాగా సహకరిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.                         
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*