వెనక్కు తగ్గిన జేసీ 



Want create site? Find Free WordPress Themes and plugins.
        అనంతపురం లోక్ సభ సభ్యుడు జేసి దివాకరరెడ్డి మెత్తబడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీటి విషయం పై స్పందించడంతో రాజీనామా నిర్ణయం నుంచి వెనక్కు తగ్గారు. తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని, ఏదైనా ఉంటే తనతో మాట్లాడాల్సిందని చంద్రబాబు చెప్పడమే ఇందుకు కారణం. అదే సమయంలో తాగునీటి విషయంలో ఉన్న ఇబ్బందిని తొలగించారు. తాడిపత్రికి నీరు ఇచ్చే విషయం పై ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి అడిగారని, వెంటనే ఆదేశాలు ఇచ్చానని చంద్రబాబు గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇస్తుంటే చంద్రబాబు నీటి దొంగతనం చేస్తున్నట్లు జగన్ పత్రిక సాక్షిలో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. దీని పైనా చంద్రబాబు మాట్లాడారు. ప్రజల కోసం తాను మంచి పనులు చేస్తుంటే తాను ఏదో దొంగలా పత్రికలలో వార్తలు ఇవ్వడం దారుణమన్నారు. కడప ప్రజలకు నీరు ఇవ్వడం వారికి ఇష్టం లేనట్లు ఉందన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పడం విశేషం. 
        జేసీ తీరుతో దేవినేని ఉమ స్పందించడం, ఫోన్ లోనే ఎంపీతో మాట్లాడటం జరిగాయి. ఒక్క రాజీనామా నిర్ణయంతో పనికి పని అయింది. ప్రజల నుంచి ప్రశంసలు దక్కాయి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*