అమరావతి వైపు అమెరికా కంపెనీల చూపు 



Want create site? Find Free WordPress Themes and plugins.
        ఆంధ్రుల నగరి అమరావతి. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తోంది. అందుకే పెట్టుబడుల వరద పారుతోంది. పెట్టుబడులు పెట్టే వారికి స్వర్గ ధామంలా ఉంది అమరావతి. అందుకే కంపెనీలు పోటీలు పడి మరీ అమరావతి కోసం ఆసక్తిగా వస్తున్నాయి. అమెరికన్‌ సంస్థలు ఇందుకు పోటీ పడుతున్నాయి. సేంద్రీయ వ్యవసాయానికి ‘ఆమ్వే’ సంస్థ ముందుకు వచ్చింది. వైద్య రంగంలో సేవలందించేందుకు పైజర్ సంస్థ నేనున్నాని చెబుతోంది.  ఏపీలోని ఒక్కో చిన్నారికి రూ. 150కే నిమోనియా వ్యాక్సిన్ వేస్తామని ఆ  సంస్థ ప్రకటించింది. 
       ఈ మేరకు సీఎం చంద్రబాబుతో భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం ప్రతినిధి బృందం సమావేశమైంది. నవ్యాంధ్రలో తాము అడుగుపెట్టేందుకు సిద్ధంగా వున్నామని ఫోరం ప్రతినిధులు ముఖ్యమంత్రికి పలు ప్రతిపాదనలు ఇచ్చారు. చంద్రబాబు నిర్ణయం తీసుకోవడమే తరువాత రంగంలోకి దిగుతామంటున్నారు. ఫలితంగా మిగతా రాష్ట్రాలు ఆంధ్రా పై ఆసక్తి చూపిస్తున్నాయి. 
        ఏపీలో సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు ఆమ్వే సంస్థ ఆసక్తి చూపుతోంది. ఆయుర్వేద ఉత్పత్తులలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది ‘ఆమ్వే. తమకు 500 ఎకరాలు కేటాయించాలని ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. కర్నాటకలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న సంగతిని వారు ప్రస్తావించారు. కుప్పంలో సేంద్రీయ సాగుపై ముందుగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడి రహిత సేంద్రియ వ్యవసాయానికి కృషి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న సుభాష్ పాలేకర్‌తో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 
      నిమోనియా వ్యాక్సినేషన్ వేసేందుకు ‘ఫైజర్’సంస్థ సిద్దమైంది. ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్‌తో కలిసి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని ‘ఫైజర్’ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు. ఒక్కో డోసు రూ. 4 వేలు విలువైన వ్యాక్సిన్‌ను రూ. 150కే వేసేందుకు వారు సిద్దం కావడం విశేషం. దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఏపీలో నిమోనియా బాధిత చిన్నారులు ఉన్నారు. అందుకే తక్షణమే వ్యాక్సినేషన్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. వారే కాదు… హిమోఫీలియా సహా అరుదైన వ్యాధుల నిర్ధారణ పరీక్షా కేంద్రాలను రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని ‘షైర్ ఫార్మాస్యుటికల్స్’ సంస్థ ప్రతినిధులు అంటున్నారు. వైద్య రంగానికి అవసరమైన ఐటీ సేవలను అందించేందుకు సిద్ధమని వారు చంద్రబాబుకు తెలిపారు.
      కంపెనీల చూపు ఇప్పుడు అమరావతి వైపు ఉండటంతో చంద్రబాబు వారికి అవసరమైన వసతి, సౌకర్యాల కల్పనతో పాటు..రాయితీలు ఇచ్చేందుకు సిద్దం కావడం విశేషం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*