అమరావతికి పేపర్ బోర్డు



Want create site? Find Free WordPress Themes and plugins.
      ఆంద్రానగరి అమరావతి అభివృద్ధికి కావాల్సిన అంశాలన్నీ ఒక్కొక్కటిగా వచ్చిపడుతున్నాయి. విద్యా, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు, వాణిజ్య రంగాలకు చెందిన అభివృద్ధి సంస్థలు అమరావతి నగరం చుట్టూర ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఐటిసి పేపర్ బోర్డు చేరుతోంది. ఇండియన్ టుబాకో బోర్డు అమరావతిలో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. స్టార్ హోటల్స్ నే కాదు..వ్యవసాయం, ఔషద రంగాలకు చెందిన ఉత్పత్తుల తయారీ సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేయనుంది. ఫలితంగా వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. 
        ఖమ్మం జిల్లా భద్రాచలం సారపాక వద్ద ఉన్న పేపర్ మిల్లును అమరావతికి విస్తరించనుంది. ఇందుకోసం రూ. 150 కోట్లతో అంచనాలు తయారు చేసింది. ఫలితంగా పేపర్ కోసం తెలంగాణ మీద ఆధారపడకుండా ఏపీలోని 13 జిల్లాలు లబ్దిపొందనున్నాయి. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే ముందుగా పేపర్ మిల్లును ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఏపీ సర్కారుకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది. దానికి అనుమతి వచ్చిపేపర్ బోర్డు ఏర్పాటు అయితే మిగతా సంస్థలను అమరావతిలో విస్తరించే ఆలోచన చేస్తోంది. పేపర్‌బోర్డు ఏర్పాటు వల్ల వందల మందికి ఉద్యోగం, ఉపాధి లభిస్తోంది. లారీలు, ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్‌ వంటి రంగాలకు పని దొరుకుతోంది. అవే కాదు..వాటి అనుబంధ  రంగాలు పుంజుకొంటాయి.
    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చూసి మిగతా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. సి.ఎం చంద్రబాబునాయుడు పనితీరును మెచ్చుకుంటున్నాయి. ఫలితంగా కంపెనీలు అమరావతిలో అడుగు పెట్టనున్నాయి. ఫలితంగా రానున్న కాలంలో అమరావతి ఆధునిక రాజధానిగా అలరారుతోంది.                
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*