అట్టర్ ప్లాప్ అయిన విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఎవరికి ఏ రంగంలో టాలెంట్ ఉంటే అందులోనే నిరూపించుకోవాలి. లేని దాంట్లో తలదూర్చిన వారికి తిప్పలు తప్పవు. అలవిగానీ చోట అధికులమనరాదనే సామెత ఉంది. బాహుబలినే కాదు… భజరంగీ భాయిజాన్ చిత్రాలతో కథా రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు విజయేంద్ర ప్రసాద్. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి తండ్రి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మణికర్ణిక సినిమాకు కథా రచయితగా పని చేస్తున్నాడు. కానీ ఆయన కథా రచయితగా తిరుగులేదు. కానీ డైరెక్షన్ విభాగంలో చేయి పెట్టి కాల్చుకున్నాడు. ఎంతగా అంటే ఇక భవిష్యత్ లో మరెవరు ఆయనతో సినిమా తీయలేనంతగా ఆయన చిత్రాలు ప్లాప్ అవుతున్నాయి. ఫలితంగా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. 
          రాజన్న సినిమాతో దర్శకుడి అవతారం ఎత్తారు. ఏదో నాగార్జున ఉన్నాడు కాబట్టి మరీ దారుణ పరాజయం నుంచి బయట పడ్డారు. ఇప్పుడు ఆయన శ్రీవల్లి అనే సినిమా తీశారు. కనీసం థియేటర్ కు జనాలు రావడంలేదు. నిర్మాతలకు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రాదని అంచనా. ఫలితంగా జీవితంలో ఇక కోలుకోలేనంతగా వారు దెబ్బతిన్నారట. మాజీ ప్రధాని దేవగౌడ మనవుడు నిఖిల్ గౌడ కు జాగ్వార్ కథ ఇచ్చారు. అది కాస్త అట్టర్ ప్లాప్ అయి కూర్చుంది. ఇక లాభం లేదనుకున్న విజయేంద్ర ప్రసాద్ రానున్న కాలంలో తాను సినిమాలు తీయనని చెబుతున్నాడు. ఒకరిద్దరు పేషెంట్లను చంపితే గానీ మంచి డాక్టర్ కాడంటారు. విషయం ఏదైనా ఇప్పుడు మూడు సినిమాలు ప్లాప్ లు మూటగట్టుకున్నాయి. అయినా ఆయన తిరిగి డైరెక్షన్ మీద మక్కువ చూపితే నష్టపోయేది నిర్మాతలే అన్నది వాస్తవం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*