బిగ్ బాస్ విన్నర్ పై ఉత్కంఠWant create site? Find Free WordPress Themes and plugins.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న షో బిగ్ బాస్. బుల్లితెర పై ఒక ఊపు ఊపుతోంది. ఈ షో రెండు రోజుల్లో ముగియనుంది. విజేత ఎవరో తేలనుంది. ఆదివారం విజేత అయిన వారికి రూ.50 లక్షల బహమతి ఇవ్వనున్నారు. కానీ ముందుగా నిర్వహించిన బడ్జెట్ టాస్క్ లో విజేతగా నిలిచాడు శివ బాలాజీ. రెండో స్థానంలో ఆదర్శ్ నిలవగా.. మూడో ప్లేస్ లో నవదీప్, నాలుగో స్థానంలో అర్చన, చివరి స్థానంలో హరితేజ మిగిలారు. అసలు రేసులో శివ బాలాజీ, నవదీప్, హరితేజలలో ఒకరు గెలిచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రేక్షకుల ఓట్లే ఇందుకు కీలకం కానున్నాయి. 
            శివ బాలాజీ… మొదటి నుంచి కోపిష్టిగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత రూటుమార్చాడు. ఇప్పుడు శివ బాలాజీ తన వంటతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. హరితేజ, అర్చనలు శివబాలాజీని మంచి ఫ్రెండ్ గా చూస్తారు. హరితేజ అయితే అసలు శివ బాలాజీని జుట్టు పట్టుకుని మరీ కొడుతోంది. అయినా పెద్దగా పట్టించుకోకుండా వెళుతున్నాడు. రేసులో అతను ముందు వరుసలో ఉన్నాడని చెప్పవచ్చు. వీలున్నంత వరకు లిమిట్ గా మాట్లాడటం అతని నైజం. కోపం వస్తే నరసింహుడు కనపడతాడనేది నిజం. 
            నవదీప్… శివ బాలాజీ తర్వాత గట్టి పోటీదారుగా ఉన్నది మాత్రం ఇతనే. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చినా అందరినీ ఆకట్టుకున్నాడు. వివాదాలు పెద్దగా లేవు. ఆటను ఎంత వరకు ఆడాలో బాగా తెలిసిన వాడు. సందర్భం ఏదైనా ఇప్పుడున్న ఐదుగురిలో నలుగురు కన్నీళ్లు పెట్టుకున్నా… నవదీప్ అలా లేడు. చాలా జోష్ గా కనిపించాడు. టాస్క్ లు చాలా బాగా పూర్తిచేస్తున్నాడు. 
      హరితేజ…. బుల్లితెర పై యాంకర్ గా ఉన్న ఈమె బిగ్ బాస్ కు ముందు పెద్దగా ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ షోలోను నాలుగు, ఐదు వారాల వరకు పెద్దగా పట్టించుకోలేదు. కానీ బుర్రకథ చెప్పిన దగ్గర నుంచి హరితేజ అంటే అందరికీ నచ్చుతోంది. తనలో ఉన్న టాలెంట్ ను బయట పెట్టింది. అప్పటి నుంచి వీక్షకులు హరితేజ ఎలిమినేట్ కాకుండా కాపాడారు. ఇప్పుడు పోటీలో ముందు వరుసలో ఉంది. 
            ఆదర్శ్... తన స్నేహితుడు ప్రిన్స్ ను అతను నామినేట్ చేయడంతో.. మిగతా వారు అదే పని చేశారు. ఫలితంగా ప్రిన్స్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ రోజు ప్రిన్స్ ను ఆదర్శ్ నామినేట్ చేయకపోతే దీక్ష ముందుగా వెళ్లేది. కానీ అనూహ్యంగా ప్రిన్స్ బయటకు వెళ్లాల్సి వచ్చింది. చాలా సున్నిత మనష్కుడు. ఎమోషన్స్ ను తట్టుకోలేక పోతున్నాడు. అయినా ఓపిగ్గా ఉన్నాడు. తనను శత్రువుల్లా చూసిన వారినే మిత్రులుగా భావించి ఆటలో కొనసాగుతున్నాడు. 
           అర్చన… చిన్న పిల్ల మనస్తత్వం. వాళ్ల అమ్మ వచ్చినప్పుడు చిన్న పిల్లలా గారాలు పోయింది. హర్ట్ అయితే ఎవరితోను మాట్లాడకుండా వెళ్లడం ఆమెకు నచ్చే అంశం. శివ బాలాజీ చెబితే చాలు.. ఏ పనైనా చేస్తోంది. దీక్ష ఉన్నంత కాలం ఆమెతో గొడవ పడింది. ఇప్పుడు ఎవరితోను గొడవలు లేవు. ఈ రేసులో చివరి స్థానంలో నిలిచేది అర్చననే అనవచ్చు.
           చివరి రోజుల్లో ఇప్పటి వరకు షోలో కొనసాగిన వారంతా మరోసారి బిగ్ బాస్ షోకు వచ్చారు. శుక్రవారం అది ప్రసారం కానుంది. అంతా ఆటపాటలతో సరదగా గడిపారు.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*