సదావర్తి భూముల పై సుప్రీం వ్యాఖ్యలు



Want create site? Find Free WordPress Themes and plugins.
         సదావర్తి సత్రం భూముల వేలం పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భూములను చౌకగా విక్రయించ వద్దని చెప్పింది. రెండోసారి జరిగిన బహిరంగ వేలంలో సదావర్తి భూములు మూడు రెట్లు అధికంగా ధర పలకడంపై ఉన్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రూ.40 కోట్లు అధికంగా ధర రావడం చిన్న విషయం కాదని చెప్పింది. రెండోసారి జరిగిన వేలంలో రూ.60.30కోట్లు పలికినప్పటికీ పాడుకున్న వారు డబ్బులు చెల్లించలేకపోయారని చెప్పింది.  రెండో స్థానంలో ఉన్న వారికి అవకాశం ఇచ్చామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. రెండో వ్యక్తి డబ్బులు చెల్లించేందుకు ఇచ్చిన గడువు శనివారంతో ముగుస్తుందని న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా పడింది. రేపు ఆ వేలం పాటదారుడు ఆ భూములను స్వాధీనం చేసుకుంటారా లేదా అనే ఉత్కంఠ నెలకుంది. 
        సదావర్తి ట్రస్ట్ కు చెందిన 83.11 ఎకరాల భూమిని కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌ వేలం పాటలో దక్కించుకుంది. సత్యనారాయణ బిల్డర్స్‌ తరఫున ప్రొద్దుటూరు ఆస్పత్రుల అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ బద్వేలు శ్రీనివాస్‌ రెడ్డి ఈ వేలంలో పాల్గొన్నారు. కానీ సకాలంలో ఆ డబ్బులు చెల్లించ లేకపోయారు. గతంలో ఆ భూమికి 37 కోట్ల 90 లక్షలకే దక్కిన సంగతి తెలిసిందే. 
            గుంటూరు జిల్లా అమరావతి కోట రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వంశీయులు ఆధీనంలో ఉండేది. అప్పుడు వేద విద్యను అభ్యసించేవారికి చేయూతనందించాలన్న ఆలోచనతో సత్రాలు ఏర్పాటు చేశారు. భక్తులు, యాత్రికులు బస చేయడానికి ఇవి ఉపయోగపడ్డాయి. రాజా వాసిరెడ్డి వంశీయులు సేవా నిరతిని మెచ్చిన పలువురు సంపన్నులు సదావర్తి సత్రానికి భారీగా భూములు, నగదు విరాళాలు అందించారు. అందులో భాగంగా తమిళనాడులోని మహాబలిపురం రహదారిని ఆనుకుని ఉన్న తాళంబూర్‌లో సదావర్తి సత్రం కోసం 471 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. ఇప్పుడా భూమి పైనా వేలం పాటలు, కోర్టుల కెక్కడం జరుగుతోంది. చివరకు అది ఎవరి పరమవుతుందో మరి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*