మోడీతోనే ఉంటానంటున్న రజనీకాంత్



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం ‘స్వచ్చతా హీ సేవా’. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ పథకానికి పూర్తి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ప్రముఖులకు లేఖలు రాశారు. రాజకీయ, సినిమా, వ్యాపార రంగాలకు చెందిన వారిని ఇందులో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. మీకున్న ప్రజాదరణతో అందరిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కు ఇలానే లేఖ రాసిన సంగతి తెలిసిందే. మోడీ లేఖ చూసిన రజనీకాంత్‌ స్పందించారు. మీరు తలపెట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. పరిశుభ్రత దైవభక్తితో సమానమని ట్వీట్ చేశారు. రజనీ రాజకీయ ప్రవేశంపై ఆసక్తి నెలకున్న నేపధ్యంలో రజనీకాంత్ ఇలా మోడీకి మద్దతు పలకడం హాట్ టాపికైంది. 
                    మరో నటుడు కమల్‌హాసన్‌ పార్టీ పెడుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ సి.ఎం కేజ్రివాల్ తోను ఆయన ప్రత్యేకంగా సమావేశమై సలహాలు సూచనలు తీసుకున్నారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే చాలా సంతోషమని చెప్పారు కమల్. రజనీ మా పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తా. రజనీతో కలిసే పార్టీని ముందుకు తీసుకెళ్తా అని ఈ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. ఉప్పు-నిప్పులా ఉండే నటులు ఇద్దరు కలవడం అంత తేలిక కాదంటున్నారు మరోవైపు అభిమానులు. తమిళనాడు మాజీ సిఎం జయలలిత చనిపోయాక.. ఆపార్టీ ముక్కలైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కమల్ హాసన్, రజనీకాంత్ లు రాజకీయ రంగం పై వస్తే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*