ప్రజలే ముందు అంటున్న చంద్రబాబు



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరికొత్తయాప్ ను తీసుకువచ్చారు. ప్రజల కోసం ప్రజలే ప్రభుత్వానికి సమస్యలను తెలిపే సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. ‘పీపుల్స్‌ ఫస్ట్‌’ (ప్రజలే ముందు) మొబైల్‌ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. వివిధ ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడం, వాటి పరిస్థితిని తెలుసుకోవడం, అవసరమైన ధ్రువపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో సహా మరెన్నో సదుపాయాలను ఈ యాప్‌లో రూపొందించారు. చాలా తేలికగానే వీటిని పొందవచ్చు. ఫలితంగా తాము ఇచ్చిన దరఖాస్తు అసలైన వారికి అందిందో లేదో తెలియక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు ఆ అప్లికేషన్ పని ఎంత వరకు వచ్చింది. ఏంటనే విషయం తెలుసుకోవచ్చు. అవసరమైతే మార్పులు, చేర్పులు చేసుకునే వీలుంది. 
              సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయే ఆలోచన చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు అంటూ చాలా మంది అప్పుడే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ యాప్ ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో ‘పీపుల్స్‌ ఫస్ట్‌ – సిటిజన్‌ మొబైల్‌ యాప్‌’ అని ఉంటోంది. ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయితేనే అది ఓపెన్ అవుతోంది. ఇక మీదట ఏం జరిగినా మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది ఇబ్బంది లేదు.  
        మీ పేరుతో పాటు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే అది ఓపెన్ అవుతోంది. మనకు కావాల్సిన సేవలు ఊరికి సంబంధించినవా ప్రభుత్వానివా.. బ్యాంకు మరే ఇతరం అనేది అందులో రాయాల్సి ఉంది. అప్పుడు మీకు సులువుగా ఆ యాప్ సంగతులు తెలుసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ పథకాల వివరాలు, దానితో పాటు అందుబాటులో ఉండటం విశేషం. https://play.google.com/store/apps/details?id=com.codetree.peoplefirstcitizen&hl=en ఇక ఆలస్యం ఎందుకు. మీరు ఓ సారి ప్రయత్నించండి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*