ఎన్నికల్లో పోటీ చేయనున్న జానారెడ్డి కుమారుడు



Want create site? Find Free WordPress Themes and plugins.
నల్గొండ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు జానారెడ్డి కుమారుడు రఘువీర్ సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల్లోనే తన కుమారుడు సీటు కోసం సిఎల్పీ నేత జానారెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు. ఒక కుటుంబానికి ఒక సీటు అనే పద్ధతిలో ఆయన కుమారుడుకు సీటు ఇవ్వలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబంలో ఇద్దరికీ సీట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు వెళ్లేందుకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి అంత ఆసక్తిగా లేడంటున్నారు. తన సోదరుడు రామిరెడ్డి వెంకటరెడ్డి చనిపోవడంతో.. పాలేరులో పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నాడంటున్నారు. కోమటిరెడ్డి సోదరులు ఇద్దరు పదవుల్లో ఉన్నారు. పాల్వాయి చనిపోవడంతో వారి కుటుంబానికి పెద్దగా అవకాశాలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఫలితంగా జానారెడ్డి తన కుమారుడుకు సీటు ఇవ్వాలని అడుగుతున్నారు. 
                   ఇదంతా గుత్తా సుఖేందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తేనే. లేకపోతే ఎవరూ పోటీ చేసే అవకాశమే లేదు. తన రాజకీయ వారసులను రంగంలోకి దింపేందుకు డిఎస్, జానారెడ్డి, కేకే వంటి సీనియర్లు ఎదురు చూస్తున్నారు. పార్టీ ఏదైనా ఒకప్పుడు వారంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఆ సీనియర్లు ముగ్గురు తమ వారసుల కోసం ఎత్తులు వేస్తున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*