లండన్ నుంచి నేరుగా కోర్టుకు జగన్



Want create site? Find Free WordPress Themes and plugins.
అక్రమాస్తుల కేసులో విచారణ కోసం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు వైకాపా అధినేత జగన్‌. తన కూతురును లండన్ యూనివర్సిటీలో చేర్పించేందుకు ఈనెల 9న ఆయన లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్ నుంచి భారత్ కు తిరిగొచ్చిన జగన్ నేరుగా కోర్టుకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఈ కేసులో నిందితులైన విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిలు కోర్టుకు వచ్చారు. మరోవైపు ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ కోర్టుకు గాలి జనార్దన్‌రెడ్డి హాజరై తమ వాదన వినిపించారు. కానీ ఆయన పిఏ అలీఖాన్‌ కోర్టుకు హాజరుకాలేదు. అలీఖాన్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీ చేసింది. 
       వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ 16 నెలలపాటు జైల్లో ఉన్నారు. బెయిల్‌ పై బయటకు వచ్చిన జగన్‌, ప్రతి శుక్రవారం న్యాయస్థానానికి హాజరవుతున్న సంగతి తెలిసిందే. తండ్రి అధికారం అడ్డంపెట్టుకుని అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలు ఆయన మీద నమోదయ్యాయి. త్వరలో పాదయాత్ర చేసేందుకు ఆయన సిద్దమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన తన కేసుల కోసం మధ్యలో యాత్ర ఆపి కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఫలితంగా జగన్‌ పాదయాత్ర కష్టం కావొచ్చంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*