జేసీ రాజీనామా వెనుక రహస్యం ఏంటీ……….



Want create site? Find Free WordPress Themes and plugins.
జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం ఎంపీ. రాజకీయ ఎత్తులు వేయడంలో సిద్దహస్తుడు. వైరి వర్గం లేకుండా చేసుకుంటాడు. చాలా జాగ్రత్తగా ఉంటాయి ఎత్తులు. అంత తేలికగా లొంగే రకం కాదు. అందుకే ప్యాక్షన్ రాజకీయాలను తట్టుకుంటూ వస్తున్నాడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే సోనియాగాంధీని దెయ్యం అన్నాడు. సోనియా బతికున్నంత వరకు ఏపీలో కాంగ్రెస్ సి.ఎం సీటు దక్కించుకోలేదన్నాడు. అసలు ఆపార్టీకి 2014 ఎన్నికల్లో ఒక్క సీటు రాదన్నాడు. ముందుగానే కాంగ్రెస్ భవిష్యత్ ను అంచనా వేసాడు. జగన్ పార్టీలోకి వెళతాడనుకున్నా. ఆపని చేయలేదు. టీడీపీలో చేరాడు.
       మంత్రి పరిటాల సునీతకు బద్ద శత్రువు. ఎన్నికలకు ముందు జేసీని పార్టీలోకి తీసుకోవడం ఇష్టం లేకపోయినా చంద్రబాబు చెప్పడంతో సర్దుకుపోయింది. ఇప్పుడు అతనే ఏకు మేకు అయి కూర్చున్నాడు. నియోజకవర్గంలో వేలు పెడుతున్నాడు. అది ప్రభాకర్ చౌదరికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇటు జేసీ సోదరులు, అటు ప్రభాకర్ చౌదరి, సునీత వైరి వర్గాలు ఏర్పడ్డారు. మంత్రి దేవినేని ఉమా వారికి జత కలిసారు. అంతే జేసీ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదు. తాను ఇచ్చిన హామీ మేరకు తాగునీరు ఇవ్వలేకపోతున్నానని గోల చేశాడు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదంతా రాజకీయ డ్రామానే.
         ఎలాగు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన చేయడంలేదు జేసీ. తన కుమారుడు పవన్ రెడ్డిని రంగంలోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పునాది పదిలంగా ఉండేందుకు వ్యూహాత్మకంగా కదులుతున్నాడు. ఆయన మాటల్లో ఎక్కడా సి.ఎం చంద్రబాబునాయుడు, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడటంలేదు. తనకు వ్యతిరేకంగా జిల్లాలో అదృశ్య శక్తి పావులు కదుపుతోంది. అది ఉన్నంత వరకు తాను ఏం చేయలేనని చెప్పారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వాస్తవంగా ఆయన సునీత పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ అందరికీ అర్థమయ్యేలా చేశాడు.
        సి.ఎం చంద్రబాబునాయుడు ఈ విషయంలో ఏం అనలేదు. జేసీ సోదరులు పార్టీలో ఉంటే మంచిదనేది బాబు ఆలోచన. అందుకే కొన్ని సార్లు వారు గీత దాటినా చూసి చూడనట్లు వ్యవహరించారు. వైజాగ్ లో జేసీ దివాకర్ రెడ్డి చేసిన హంగామా మరొకరు చేసి ఉంటే కచ్చితంగా చర్యలు ఉండేవి. కానీ ఆపని చేయలేకపోయారు చంద్రబాబు. విపక్ష నేతలు ఎవరైనా అలా ఎయిర్ పోర్టులో వీరంగం వేస్తే టీడీపీ నేతలు ఊరుకునేవారు కాదనేది వాస్తవం. ఇప్పుడు జేసీ రాజీనామా డ్రామా ఆడినా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారిని ఏం అనలేని పరిస్థితి. రాయలసీమలో రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే కొన్ని విషయాలను చూస్తు ఊరుకుంటేనే మేలు. లేకపోతే టీడీపీకి ఇబ్బంది అని భావిస్తున్నాడు చంద్రబాబు. అందుకే జేసీ సోదరులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.
       జేసీ రాజీనామా ప్రకటనతో మంత్రి దేవినేనిలో కదిలిక వచ్చింది. కమ్మ లాబీయింగ్ తో తనను అడ్డుకుంటున్నారని.. బెజవాడ మంత్రికి ఇందుకు సహకరిస్తున్నాడనేది జేసీ ఆరోపణ. తనకెందుకు గోల అనుకున్నాడు దేవినేని. వెంటనే సాగునీటి అధికారులతో మాట్లాడిన ఆయనకు కావాల్సిన రీతిలో నీటిని విడుదల చేశారు. దీంతో సమస్య కొంత వరకు సద్దుమణిగింది. ఇక రాజీనామా వెనక్కు తీసుకుంటారా లేదా అనేది తేలాలి.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*