చంద్రబాబుకు కువైట్ ప్రతినిధుల ఆహ్వానం



Want create site? Find Free WordPress Themes and plugins.
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కువైట్ రావాల్సిందిగా ఆహ్వానించారు ఏపీఎన్‌ఆర్టీ గల్ఫ్ దేశాల ప్రతినిధులు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలు సుగమం చేసేందుకు ప్రవాసాంధ్రులను చైతన్య పరిచేందుకు ఏపీఎన్‌ఆర్టీ కృషి చేస్తున్నసంగతి తెలిసిందే. అవసరమైన మేరకు వారి సమస్యలను పరిశీలించి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారు రవి వేమూరు నేతృత్వంలో ఆ విభాగం ప్రతినిధులు చంద్రబాబును కలిశారు. తెలుగురాష్ట్రాలకు చెందిన చాలా మంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ సంస్థ ప్రతినిధి మహమ్మద్ బోరా, కువైట్ లో సేవలందిస్తున్న సుబ్బరాయుడులు ఆయనతో ఉన్నారు.   
                       విదేశాలలో ఉంటున్న ప్రతి తెలుగు వారి సంక్షేమం కోసం ఏపీఎన్‌ఆర్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విదేశాలలో ఉంటున్న ప్రతి తెలుగు వారు విధిగా ఈ సంస్థ లో సభ్యత్వం నమోదు చేసుకుంటే ఒక ఐడీ నెంబర్ ఇస్తారు. ఆ నెంబరు ఆధారంగా ఆపదల్లో ఉన్న వారికి ఏపీఎన్‌ఆర్టీ తగు రీతిలో సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయం పై అవగాహన కల్పించేందుకు ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరు గల్ఫ్ దేశాల్లో జులై రెండో వారంలో అక్కడ పర్యటించిన సంగతి తెలిసిందే.  
                         కువైట్ లోని ఏపీఎన్‌ఆర్టీ కో-ఆర్దినేటర్స్ ను ప్రవాసాంధ్రులను కలిశారు ఈ పర్యటనలో రవి. కువైట్ కో ఆర్దినేటర్స్ తో పాటు… కువైట్ లోని వివిధ ప్రాంతాలలో పర్యటించిన రవి వేమూరు తెలుగు వారికి అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న గల్ఫ్ ప్రవాసిల పాలసీపై అవగాహన కల్పించారు. ప్రవాసులకు వచ్చే ఇబ్బందులు, ఇందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు సి.ఎం చంద్రబాబుతో మాట్లాడి తగు పరిష్కారాలను ఏపీఎన్‌ఆర్టీ సూచించింది. అవసరమైతే వారిని ఆదుకునేందుకు నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీనిచ్చారు. ప్రభుత్వం తమకు ఏంచేస్తే బాగుంటుంది అనే విషయమై సలహాలు సూచనలను ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు రవికి చెప్పారు ప్రవాసాంద్రులు.
                          ఆ తర్వాత కువైట్ కో ఆర్డినేటర్స్ తో ఎంబసీకి వెళ్లిన రవి కుమార్.. భారత రాయబారి సునీల్ జైన్ తో చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉంటున్న తెలుగు వారికి ఏవిధంగా సేవ చేస్తున్నారనే విషయం ప్రస్తావించారు. అలానే వారికి సేవ చేసేందుకు కొత్తగా తయారు చేసిన వలస దారుల సాంఘిక సంక్షేమ పాలసి గురించి అంబాసిడర్ కు వివరించారు. రాయబారి సునీల్ జైన్ సలహాలు, సూచనలను తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం నుండి ప్రతి నెల ఎవరో ఒకరు విధిగా కువైట్ లో పర్యటించాలని.. ఇక్కడ నివాసం ఉంటున్న తెలుగు వారిని కలిస్తే బావుటుందని.. అంబాసిడర్ సలహానిచ్చారు. 
                           ఈ విషయాలను సి.ఎం చంద్రబాబుకు వివరించారు రవి వేమూరు. అందుకే కువైట్ దేశంలో పర్యటించి అక్కడి వారి బాగోగులు చూడటమే కాదు.. పెట్టుబడులు పెట్టే వారితోను మాట్లాడాలని కోరారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఏపీఎన్‌ఆర్టీ చేపట్టిన ప్రవాసుల ఐకాన్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనుంది. అమెరికాతో పాటు.. అరబ్ దేశాల్లో ఉన్న తెలుగు వారిని ఆ సంస్థ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. వారి సమస్యలతో పాటు.. ఏం చేస్తే బావుంటుందనే అంశంపై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపింది ఏపీఎన్‌ఆర్టీ. ఇందుకు సంబంధించిన అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. దీన్ని బాబు సర్కారు పరిగణనలోకి తీసుకోవడం అభినందనీయమని ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ రవి వేమూరు చెప్పారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*