వైసీపీ ఎమ్మెల్యే సురేష్ దంపతుల పై సీబీఐ కేసు



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కారణంతో ప్రకాశం జిల్లా సంతనూతల పాడు ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్‌, ఆయన సతీమణి విజయలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కుటుంబం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉందని ప్రాధమికంగా సీబీఐ నిర్థారణకు వచ్చింది. ఇప్పుడీ కేసు సంచలనంగా మారింది. కోటి రూపాయల కంటే విలువైన ఆస్తులు వారు కలిగి ఉన్నారని అభియోగం మోపడం ఆశ్చర్యంగా ఉంది. అందులో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న సురేష్ దంపతులపై కేసు నమోదు చేయడం ఇప్పుడు హాట్ టాపికైంది. 
           సురేష్ సతీమణి విజయలక్ష్మీ ఐఆర్‌ఎస్‌ అధికారిణిగా పనిచేస్తున్నారు. తమ పై కేసు నమోదు కావడంతో వైసీపీ ఎమ్మెల్యే సురేష్ కు ఇబ్బంది వచ్చింది. ఈ కేసులో ఏ-1గా విజయలక్ష్మి, ఏ-2గా సురేష్ ఉన్నారు. ఆదాయానికి మించి రూ. కోటి ఉన్నట్లు గుర్తించిన సీబీఐ ఆ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి, 2016 ఫ్రిబ్రవరి 29వ తేదీ వరకు వీరిద్దరు అక్రమ ఆస్తులు కలిగివున్నారని సీబీఐ అభియోగం. 1994 బ్యాచ్‌కు చెందిన విజయలక్ష్మి ఇండియన్ రైల్వే సర్వీస్‌లో చేరారు. ఆ తర్వాత ఇన్‌కమ్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు.
         కోటిరూపాయలకు పైగా ఆస్తి ఇప్పుడున్న ప్రతి ఎమ్మెల్యే వద్ద ఉంటోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కావాలని ఆ ఒక్క ఎమ్మెల్యేనే టార్గెట్ చేయడం రాజకీయ కోణంలో భాగమేనని వైకాపా ఆరోపిస్తోంది. అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారు. ఇందులో రాజకీయ కోణం లేదనేది మరోవైపు తెలుగుదేశం నేతల మాటగా ఉంది. దీంతో సీబీఐ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*