బెనజీర్ భుట్టోను భర్తే హత్య చేయించారా



Want create site? Find Free WordPress Themes and plugins.
పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోను ఆమె భర్త, మాజీ అధ్యక్షులు జర్దారీ హత్య చేయించారని సంచనల ప్రకటన చేశారు పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్. పాకిస్తాన్ లో రాజకీయ కోసం ఏమైనా చేస్తారనేందుకు ఇదే ఉదాహరణ అని ఆయన ఆరోపించారు. భుట్టో హత్యలో జర్దారీకి కూడా భాగస్వామ్యం ఉందని ముషారప్ చెప్పారు. అంతే కాదు… ఆమె సోదరుడు ముర్తాజ భుట్టో చావుకు కూడా జర్దారీ కారణం అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు పాక్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. అధికారం కోసమే భర్త ఇంత పనికి ఒడిగట్టారని ఆయన ఆరోపించారు.  
                      2007 డిసెంబర్ 27వ తేదీన పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో రావల్పిండిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎన్నికల సభలో పాల్గొని వస్తున్న భుట్టోపై తుపాకులు, బాంబులతో దాడి చేసి హతమార్చారు. ఈ కేసులో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాత్ర కూడా ఉందని కోర్టు తేల్చింది. ఈ క్రమంలో ముషారఫ్‌కు కోర్టు షాకిచ్చింది. బెనజీర్ భుట్టో హత్య కేసులో నిందితుడైన ముషారఫ్ దేశం నుంచి పారిపోయాడని కోర్టు కీలక ప్రకటన చేసింది. అంతేకాదు భుట్టో హత్యకు జరిగిన కుట్ర గురించి ముషారఫ్‌కు బాగా తెలుసని.. ఆమె హత్యలో ఆయన పాత్ర కూడా ఉందని కోర్టు తేల్చి చెప్పింది. రావల్పిండిలో భుట్టో ఎన్నికల సభకు అప్పటి ముషారఫ్ సర్కారు భద్రత కల్పించడంలో విఫలమైందని పేర్కొంది. 
                      ఈ కేసులో ఐదుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. ఇద్దరు పోలీసు అధికారులకు కోర్టు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. ఇద్దరికి రూ.5లక్షల చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో ముషారఫ్ దోషి అని తాజాగా కోర్టు ప్రకటించిన నేపద్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భుట్టో కుటుంబంలో జరిగిన దుర్ఘటనలన్నింటికి జర్దారీ నే కారణమని ముషారప్ అన్నారు. బెనజీర్‌ భుట్టో, ఆమె సోదరుడు ముర్తాజా భుట్టో హత్యకు కారణం జర్దారీనే అంటూ ఆయన భుట్టో జర్దారీ ముగ్గురు పిల్లలకు వీడియో ద్వారా తెలిపారు. భార్య భుట్టో చనిపోయినా ఏమీ పట్టించుకోని జర్దారీ పదవీ కాలాన్ని మాత్రం ఐదేళ్లపాటు దర్జాగా అనుభవించారని ముషారఫ్ అన్నారు. దీంతో అసలు జర్దారీ పాత్ర పై విచారణ జరగనుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*