లావణ్య త్రిపాఠి పై ఫిర్యాదు



Want create site? Find Free WordPress Themes and plugins.
అందాల రాక్షసిగా తెలుగులో అడుగుపెట్టింది. సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్‌ వంటి హిట్‌ చిత్రాల్లో నటించింది అందాల తార లావణ్య త్రిపాఠి. ఇప్పుడీ అమ్మడు చిక్కులో పడింది. తెలుగులో ఘన విజయం సాధించిన 100% లవ్‌ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. చంద్రమౌళి దర్శకత్వంలో 100% కాదల్‌ పేరుతో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. జీవీ. ప్రకాశ్‌కుమార్‌ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో లావణ్య త్రిపాఠిని కథా నాయికగా ఎంపిక చేశారు. ఈ చిత్రం షూటింగ్‌ను లండన్‌లో నిర్వహించడానికి సిద్ధమయ్యారు. చిత్ర యూనిట్ అంతా లండన్‌కు బయలుదేరుతున్న సమయంలో లావణ్య వెళ్లేందుకు సిద్ధం కాలేదు. 
                      ఇది చిత్ర దర్శకుడు చంద్రమౌళికి కోపం తెప్పించింది. అందుకే లావణ్యపై దక్షిణ భారత సినీ వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. లావణ్య బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించింది. ఫలితంగా తాము లక్షల్లో నష్టపోయామని చెప్పారు. అందుకే 2006 మిస్ ఉత్తరాఖండ్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి సీరియస్ గా సమాలోచనలు చేస్తోంది. లావణ్య త్రిపాఠిపై ఎలాంటి చర్య తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారు. మరోవైపు లావణ్య త్రిపాఠికి మద్దతుగా తెలుగు సినీ ప్రముఖుడు ఒకరు జోక్యం చేసుకుని.. ఆమెను బయటపడేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తున్న అపురూప లావణ్యవతి ఈ వివాదం నుంచి బయట పడాలని ప్రత్యేకంగా పూజలు చేస్తుందట. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*