అసలు సంగతి చెప్పిన రాజమౌళి



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రానగరి అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో సి.ఎం చంద్రబాబునాయుడు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సాయం కోరిన సంగతి తెలిసిందే. రాజమౌళి సలహాలను తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అదే సమయంలో రాజధానిలో పర్యటించిన దర్శకుడు మూడు దఫాలుగా బాబును కలిసి వచ్చారు. రాజధానిని పరిశీలించారు. కానీ వారిద్దరి మధ్య జరిగిన చర్చలు ఏంటి, వాస్తవం ఏంటనే విషయం పై అనేక రకాల ప్రచారాలు వచ్చాయి. అమరావతి నిర్మాణ సలహాదారు, రూపశిల్పి, పర్యవేక్షకుడిగా రాజమౌళి నియమితుడైనట్లు ప్రచారం వచ్చింది. ఇక లాభం లేదనుకున్న రాజమౌళి ఆ ఊహగానాలకు తెరదించారు.
       చంద్రబాబునాయుడిని కలిసిన రాజమౌళి వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. ‘అమరావతి నిర్మాణ సలహాదారు, డిజైనర్‌, పర్యవేక్షకుడిగా నన్ను నియమించారన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఫోస్టర్‌ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థ. వారు అందించిన డిజైన్లు బాగున్నాయి. చంద్రబాబు.. ఆయన బృందం ఆ డిజైన్లతో సంతృప్తిగానే ఉన్నారు. అయితే అసెంబ్లీ భవన డిజైన్‌ మరింత అద్భుతంగా ఉండాలనేది వారి కోరిక. భవనాల నిర్మాణ ప్రక్రియ వేగవంతం కావడానికి నేను సలహాలు, సూచనలు ఇస్తాను. ఆయన విజన్‌ను ఫోస్టర్‌, వారి భాగస్వాములకు వివరిస్తాను. చారిత్రక ప్రాజెక్టులో నావంతు కృషి, సహాయం చాలా చిన్నదని ట్వీట్ చేశారు. ఇంత చెప్పినా లండన్ కు వెళ్లేది లేనిది చెప్పలేదు రాజమౌళి. 
        మరోవైపు రాజమౌళి అమరావతి నగర నిర్మాణ డిజైన్లలో కొన్ని మార్పులు, చేర్పులు చెప్పారని తెలుస్తోంది. తెలుగు దనం ఉట్టిపడేలా ఆ డిజైన్ ను రూపొందించే ఆలోచన చేస్తున్నారట. త్వరలోనే ఆ డిజైన్లను చంద్రబాబుకు చూపించి అవి నచ్చితే పైనల్ చేయాలని చెప్పనున్నారు రాజమౌళి. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*