మోడీని మెచ్చుకున్న రాహుల్



Want create site? Find Free WordPress Themes and plugins.
        ప్రధానమంత్రి నరేంద్రమోడీని మెచ్చుకున్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇది నిజమేనా అని అంతా ఆశ్చర్యంగా చూశారు. అవును నేను చెబుతోంది నిజమే.  మోడీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం నాకు ఎంతో బాగా నచ్చిందని మరోసారి చెప్పారు రాహుల్ గాంధీ. అంతే అక్కడ ఉన్న వారంతా చప్పట్లతో మారు మోగించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మేక్ ఇన్ ఇండియా ప్రస్తావన వచ్చింది. ‘మేక్‌ ఇన్‌ ఇండియా నాకు బాగా నచ్చింది. కానీ దాని అమలు తీరు సక్రమమైన పద్ధతిలో లేదు. పెద్ద వ్యాపారులను లక్ష్యంగా పెట్టుకోవాలని మోడీ భావిస్తున్నారు. మధ్య, చిన్న తరహా కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటే బాగుండేదని చెప్పారు రాహుల్. 
        విపక్ష నేత ఎవరైనా అధికారపార్టీ చేసే మంచి పనిని స్వాగతించడం మాములు విషయం కాదు. అందులోను భారత్ లాంటి దేశాల్లో అధికార పక్షం ఏం చేసినా విపక్షాలు తప్పు పట్టడమే మనం చూస్తుంటాం. అలాంటిది మోడీ ప్రవేశ పెట్టిన పథకాన్ని మెచ్చుకుని విపక్ష నేతగా సలహానివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం. భారత్‌లో నిత్యం 30వేల మంది యువత ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ 450  ఉద్యోగాలు మాత్రమే వస్తున్నాయి. మేక్‌ ఇన్‌ ఇండియాను కాంగ్రెస్‌ పార్టీ చేయలేకపోయిందని చెప్పారు రాహుల్. రెండు వారాల అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌ ఇటీవల కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న సమయంలోను మోడీ తీరును ప్రశంసించిన సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్లినప్పుడు రాజకీయాలు కాకుండా వాస్తవాలను చెప్పేందుకు రాహుల్ ప్రయత్నించడం అభినందనీయం
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*