జై లవకుశ ఫస్ట్ రివ్యూ



Want create site? Find Free WordPress Themes and plugins.
సినిమాల పై తొలి రివ్యూను ఇస్తాడు ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు. జై లవకుశ మూవీకి అలానే రివ్యూ ఇచ్చాడు. అందరితో పాటు..తాను చాలా ఉత్సాహంగా సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పాడాయన. ఆయన ఏం అనుకుంటున్నాడో సంధు మాటల్లోనే.. సినిమాలో డైలాగ్ లు పేలాయి. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చాలా అద్భుతం. సినిమాకు సంగీతం బాగాప్లస్ అవుతోంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రలు బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. కొన్ని సార్లు సినిమా స్లోగా నడిచినట్లు అవుతోంది. స్క్రీన్ ప్లే అదిరింది. సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా ఆకట్టుకుంది. ఈసినిమా చూస్తున్నంత సేపు చాలా కలర్ పుల్ గా కనపడుతోంది. కేఎస్ రవీంద్ర డైెరెక్షన్ లో ఇరగదీశాడు. 
                      కథ, కథనం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కానీ సిినిమా కథలో కొన్ని లోపాలు ఉన్నాయి.  క్లైమాక్స్ చాలా బాగుంది. స్టంట్స్, యాక్షన్ సీన్స్ అందరినీ అలరిస్తాయి. జై, లవ, కుశ పాత్రలు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎప్పటికీ గుర్తుండి పోతాయి. అందరినీ అలరించనున్నాయి. ఈ ఏడాదిలోనే జై లవకుశ సినిమా అద్భుత చిత్రంగా ఆడుతుంది. ఎన్టీఆర్ కు అవార్డు వచ్చే సినిమాగా ఉంటోంది. కొన్ని పాటలకు ఎన్టీఆర్ వేసిన నృత్యాలు అభిమానులను అలరిస్తాయి. ఇక కథానాయికలు, ఇతర నటుల పాత్రలు ఆకట్టుకుంటాయి. రోణిత్ రాయ్ పాత్ర సినిమాకే హైలెట్ అవుతోంది. ఇక తమన్నా ఐటమ్ సాంగ్ తిరుగులేదు. మొత్తానికి సినిమా పైసా వసూలే..
ఉమర్ సంధు రేటింగ్ 3.5/5
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*