ఏపీ బాధ్యతల నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారాయన. తనను ఏపీ బాధ్యతల నుంచి తప్పించాలని తన స్థానంలో కొత్తవారిని నియమించాలని కోరినట్లు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఏపీ వ్యవహారాల్లో పెద్దగా ఆసక్తి చూపించడం లేదు డిగ్గీరాజా. నేతల్లోనే ఉత్సాహం లేకపోతే ఇక కార్యకర్తల్లో ఏముంటుంది. అందుకే దిగ్విజయ్ సింగ్ ఏపీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిన సంగతి తెలిసిందే. ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు. ఉప ఎన్నికల్లో ఎక్కడా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. రాబోయే ఎన్నికల్లోను ఆపార్టీకి సీట్లు వస్తాయనే గ్యారెంటీ లేదు. ఇది కాంగ్రెస్ కు పెద్ద సంకటంగా మారింది. 
                      నంద్యాల ఉప ఎన్నికలలో దారుణ పరాజయమే కాదు..15 వందల ఓట్లు రావడం మరింతగా డిగ్గీరాజాను కుంగదీసింది. ఏపిలో కాంగ్రెస్ కోలుకోవడం అంత తేలిక కాదని, ఈ పరిస్థితిలో ఏపీ బాధ్యతలు నిర్వహించడం మంచిది కాదని ఆయన భావించారు. ఇలాంటి సమయంలో ఏపీ బాధ్యతలను తీసుకునేందుకు మరో నేత ఎవరు ముందుకు రావడం లేదు. అదిష్టానం ఎవరి పేరు ప్రతిపాదించినా కాదంటున్నారట. పదేళ్ల పాటు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘోరమైన పరిస్థితి వస్తుందని సోనియా ఊహించ లేదంటున్నారు.  
Did you find apk for android? You can find new Free Android Games and apps.



1 Comment

Leave a Reply

Your email address will not be published.


*