టీడీపీలోకి అనంత వైకాపా ఇంఛార్జ్



Want create site? Find Free WordPress Themes and plugins.
నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ు వైకాపా నేతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫలితంగా చాలా జిల్లాల్లో పార్టీ మారేందుకు సిద్దమవుతున్నారు. దసరా తర్వాత ఎమ్మెల్యేల వికెట్లు పడతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. పది లోపే వారు ఉంటారనే ప్రచారం ఉంది. ఈలోపే అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాధరెడ్డి టీడీపీ జెండా పట్టనున్నారు. ఈ మేరకు మంత్రి పరిటాల సునీత చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అనంతపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమళ్ల గుర్నాథ్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ు. టీడీపీలో చేరిక గురించి చర్చించడం కోసం గుర్నాథ్ రెడ్డి ఇటీవల తన అనుచరులతో అంతర్గత సమావేశం నిర్వహించారని తెలుస్తోంది. అనంతపురం నియోజకవర్గం నాయకుడిగా ఉన్న గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరితే ఆయన కుటుంబమంతా అదే బాట పట్టే అవకాశం ఉంది. 2009 ఎన్నికల్లో టీడీపీ నేత మహలక్ష్మీ శ్రీనివాస్ పై ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన 2014 ఎన్నికల్లో పోటీ చేసినా పరాజయం పాలయ్యారు గుర్నాధ్ రెడ్డి. రాబోయే కాలంలో టీడీపీదే విజయమని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారట. అందుకే వైకాపా అధ్యక్షులు జగన్ ను కాదని తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైనట్లు సమాచారం. పరిటాల రవి ఉన్న కాలం నుంచి టీడీపీ నేతలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇప్పుడు వారితో కలిసిపోయేందుకు సిద్దం కావడం అనంత రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*