అవిశ్వాస పరీక్ష వద్దన్న కోర్టు



Want create site? Find Free WordPress Themes and plugins.
        తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తమిళనాడు ప్రభుత్వం పై అవిశ్వాస పరీక్ష పెట్టవద్దని చెప్పింది తమిళనాడు హైకోర్టు. అదే సమయంలో అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో వెంటనే ఉప ఎన్నికలు పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. దినకరన్ వర్గానికి చెందిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు పడిన కేసు విచారణకు తీసుకుంది కోర్టు.  అక్టోబర్ నాలుగుకు ఈ కేసును వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు చెప్పింది.  స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, తమపై అక్రమంగా వేటు వేశారని ఈ ఎమ్మెల్యేల తరపున న్యాయవాది గట్టిగానే తమ వాదన వినిపించారు. హైకోర్టు నిర్ణయాన్ని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు స్వాగతించారు. గవర్నర్ విశ్వాస పరీక్ష విషయంలో కావాలని జాప్యం చేశారని డిఎంకే పక్ష న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. వారి వాదనలు విన్న తర్వాత హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపికైంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*