చీలిక భయంలో శివసేన 



Want create site? Find Free WordPress Themes and plugins.
మహారాష్ట్రలో పడ్నవీస్ ప్రభుత్వానికి రాం రాం చెప్పేందుకే శివసేన సిద్ధమవుతోంది. అది జరగక ముందే కొంత మంది ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునేందుకు కమల దళం పావులు కదపడం ఆసక్తికరం. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ప్రభుత్వం కొనసాగాలంటే 144 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. బీజేపీకి అక్కడ ఉంది 122 మంది నేతలే. శివసేనకు 63 మంది ఎమ్మెల్యేలున్నారు. వారి మద్దతుతోనే ప్రభుత్వం కొనసాగుతోంది. తాజా పరిణామాలతో బీజేపీతో సరైన సంబంధాలను కొనసాగించలేకపోతోంది శివసేన. అందుకే ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ఆ పార్టీ ఎంపీలెవరు హాజరు కాలేదు. విస్తరణలోను ఆ పార్టీకి చోటు దక్కలేదు. ఫలితంగా అవకాశం కోసం ఎదురు చూస్తోంది శివసేన. తమ మద్దతును ఉప సంహరించుకునే ఆలోచన చేస్తోంది. హఠాత్తుగా శివసేన తన నిర్ణయం తీసుకున్నా ఇబ్బంది రాకుండా ఉండేందుకు బీజేపీ పెద్దలు పెద్ద వ్యూహమే అమలు చేస్తున్నారు. శివసేన లోని 23 మంది వరకు ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకునే కసరత్తు సాగుతోంది. అవసరమైతే ఆ సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తోంది. 
                          బీజేపీ సర్కారుకు శివసేన మద్దతు ఉపసంహరించుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలే అండగా నిలుస్తారట. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేతకే ఎమ్మెల్యేలు చెప్పారంటున్నారు. ఫలితంగా ఉద్ధవ్‌ ఠాక్రేకు ఏం చేయాలో పాలుపోవడంలేదంటున్నారు. మొండిగా తన నిర్ణయాన్ని అమలు చేస్తే పార్టీ చీలిపోతుందని భయపడుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఉద్ధవ్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఎదురు తిరగడం ఆయన్ను ఆందోళనకు గురి చేస్తుందట. శివసేనతో ముప్పు వస్తుందని ముందే ఊహించిన మోదీ, అమిత్ షా లు పక్కా వ్యూహాన్ని అమలు చేయడమే ఇందుకు కారణం. మనసులో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని ఉన్నా.. ఆ పని చేస్తే కడుపు చించుకున్నట్లు అవుతుందని భావిస్తున్నారట. అందుకే అటు నిర్ణయం తీసుకోలేక అలాయని ఊరుకోలేక తల్లడిల్లుతున్నట్లు తెలుస్తోంది.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*