కంచె ఐలయ్య పై మండిపడ్డ పరిపూర్ణానంద స్వామి



Want create site? Find Free WordPress Themes and plugins.
       కంచె ఐలయ్య పై విమర్శల వాన కురుస్తోంది. నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఆయన రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకం పై నిషేదం కొనసాగుతోంది. అదే సమయంలో ఐలయ్యను అరెస్టు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఐలయ్యను తెలుగు రాష్ట్రాల నుంచి తరిమేయాలనే డిమాండ్ వస్తోంది. అంతే కాదు..అసలు ఐలయ్యను ఉరి తీయాలని డిమాండ్ చేశారు కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీ టిజి వెంకటేష్. కంచె ఐలయ్యపై  మండిపడ్డారు మరోవైపు శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి. సాధారణంగా వివాదాస్పద అంశాల పై ఆయన మాట్లాడరు. కానీ ఐలయ్య చేసిన తప్పుకు మాట్లాడాల్సి వస్తుందని చెప్పారు స్వామి. వైశ్యులు తమ వ్యాపారాలను ఖచ్చితంగా చేస్తారు. తమకు వచ్చిన దాంట్లో పది శాతం సమాజం కోసం ధర్మకార్యాలు చేసే పుణ్య చరిత్ర వైశ్యులదన్నారు. అలాంటి వాళ్ళను ఐలయ్య స్మగ్లర్లు అనడం మంచిది కాదన్నారు. మతం మారిన తరువాత ఐలయ్యకు మైండ్ పని చేయడం లేదన్నారు. మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ, మల్టీ నేషనల్ కంపెనీలు చేసిన దోపిడీపై ఐలయ్య ఏనాడు నోరు విప్పడు అని విమర్శించారు.
 
       దళితుడనే పేరు పెట్టుకుని దళితులనే మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాడని మండిపడ్డారు.  హిందుత్వ జోలికి వస్తే ఐలయ్య కధ కంచికి చేరుతుందని పలువురు స్వామీజీలు హెచ్చరించారు. దేశ భద్రతపై ఐలయ్య దెబ్బ కొడుతున్నాడంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఐలయ్య, ఆయన వెనక ఉన్నశక్తుల పై దృష్టి పెట్టాలనే డిమాండ్ చేస్తున్నాయి హిందూత్వ సంస్థలు. జాకీర్ నాయక్ తరహాలో ఐలయ్యపై నిఘా పెట్టి విచారణ జరపాలని, లేదంటే తమ గళం, దళం, బలం ఏమిటో చూపిస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఐలయ్య విషయం ఏం చేయాలనే అంశం పై తెలంగాణ సి.ఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే వీలుంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*