చంద్రబాబుకు ప్రశంసలు 



Want create site? Find Free WordPress Themes and plugins.
చంద్రబాబు సర్కారు పాలనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు పలువురు ప్రముఖులు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చంద్రబాబు పాలన తీరును మెచ్చుకున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇబ్బంది ఉండదని.. ఇటీవల తిరుపతి వచ్చిన సందర్భంగా చెప్పిన మాట. అలానే లెప్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చంద్రబాబు తీరు ప్రశంసించారు. మినిమయ్ గవర్నమెంట్ మాగ్జిమమ్ గవర్నెస్ పథకం చాలా బాగుందని కితాబునిచ్చారు. 1100 కాల్ నెంబర్ ద్వారా ఫిర్యాదులు తీసుకోవడం పరిష్కారం చూపడం చాలా బాగుందన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె ట్యాగ్ చేశారు. కేంద్ర మంత్రి ఉమా భారతి, బీహార్ డిప్యూటీ సి.ఎం సుశీల్ మోడీ చంద్రబాబు పాలనను మెచ్చుకున్నారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఇలానే చంద్రబాబు పాలనకు కితాబునిచ్చిన సంగతి తెలిసిందే. 
         నోబెల్ బహుమతి సాధించే మొట్టమొదటి ఆంధ్రుడికి వందకోట్లరూపాయలు బహుమానంగా ఇస్తామని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనను హరిత విప్లవానికి నాంది పలికిన ఎంఎస్ స్వామినాథన్ ప్రశంసించారు. పరిశోధనల్లో శాస్త్రవేత్తలను ప్రోత్సహించడానికి చంద్రబాబు ఇచ్చిన ప్రకటన స్ఫూర్తి నింపుతుందన్నారు. ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ఇంత అద్భుతంగా చేయవచ్చా అమరావతి రాజధాని శంఖుస్థాపనపై కాలిఫోర్నియా నగర మేయర్ బిల్ హారిజన్ అన్న సంగతి తెలిసిందే. పకృతి విలయాలపై చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను తమిళ పత్రికలు ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇండియాలో చంద్రబాబు అనే సీఎం ఉండేవారు. ఆయన ఐటీ రంగాన్ని ఎంతో ప్రోత్సహించి ఎందరో యూత్ కి మంచి లైఫ్ ఇచ్చారని పాకిస్తాన్ మీడియాలో జరిగిన చర్చాగోష్టిలో అక్కడి మేథావులు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. చంద్రబాబుకు చైనా ఉప ప్రధానమంత్రి వాంగ్ యింగ్ ప్రశంసలు కురిపించి ఆయన పనితీరును మెచ్చుకున్నారు. 
                         ఇప్పుడు ఆ జాబితాలో చేరారు నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి. క‌ర్నూలు ఏపీఎస్పీ బెటాలియ‌న్ మైదానంలో బాల‌ల భ‌ద్ర‌తే భార‌త భ‌ద్ర‌త పేరుతో కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. సీఎం చంద్ర‌బాబు నాయుడుతో పాటు… నోబెల్ శాంతి పురస్కార గ్ర‌హీత కైలాశ్ స‌త్యార్థి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ప్రశంసల వర్షం కురిపించారు కైలాష్ సత్యార్థి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక నేత ఇలా బాలల హక్కుల పరిరక్షణ కోసం రోడ్డు పైకి రావడం ఇదే మొదటిసారి అన్నారు. భార‌త యాత్ర‌కు తాను సంకల్పించిన‌ప్పుడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాన‌ని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడే మొదట స్పందించారని నోబెల్ శాంతి పుర‌స్కార‌ గ్రహీత కైలాశ్ స‌త్యార్థి చెప్పారు. ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌ేందుకు ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారని ప్రభుత్వం పనితీరు బాగుంటే ఎవరైనా వస్తారన్నారు. పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్ట‌డంతో పాటు బాల‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు కృషి చేయాల‌ని కోరారాయన. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*