ప్రయోగాలు చేస్తున్న నాగార్జున



Want create site? Find Free WordPress Themes and plugins.
ప్రయోగాలు చేయడం కింగ్ నాగార్జునకు ఇష్టం. శివలాంటి యూత్ సినిమాలో చేసినా… గీతాంజలి, నిన్నే పెళ్లాడుతా వంటి ప్రేమ కథ సినిమాలు చేసినా… భక్తిరసం కురిపించే అన్నమయ్య, శ్రీరామదాసు చేసినా ఆయనకే చెల్లింది. ప్రత్యేక కథలను ఎంచుకొనే నాగ్ మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి డిఫరెంట్ చిత్రాలతో విజయం సాధించాడు. ఈ సారి హార్రర్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. రాజుగారి గదికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ సందడి అప్పుడే ప్రారంభమైంది. నాగార్జున కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఈ మధ్య ప్రతి సినిమాని కొత్త ఫార్ములాతోనే చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ హార్రర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తీసి భయపెట్టబోతున్నాడు. నాగార్జున ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆ సినిమానే రాజుగారి గది2. ఓంకార్ దర్శకత్వంలో వచ్చి సక్సెస్ అయిన రాజుగారి గదికి సీక్వెల్ ఈ మూవీ. 
          రాజుగారి గది2లో మానసిక వైద్యుడుగా నాగార్జున కనిపిస్తాడట. ఆత్మగా స్టార్ హీరోయిన్ సమంత నటిస్తోంది. శీరత్ కపూర్ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా… పీవీపీ సంస్థ, మాట్నీ ఎంటర్ టైయిన్ మెంట్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తుండగా… రాజుగారి గది2 మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 13న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్దం అవుతోంది. మామ నాగార్జున, కోడలు సమంత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో కాస్తంత ఆసక్తి ఎక్కువగానే ఉంది. ఈ నెల 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ఫలితంగా ఈ సినిమా కోసం అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*