కూతురును బయటకు లాగుతున్న వర్మ



Want create site? Find Free WordPress Themes and plugins.
రామ్ గోపాల్ వర్మను కూతురు రేవతి కొడతానంటోంది. ఆపని చేస్తుందో లేదోగానీ విషయం అంత వరకు వచ్చింది. ఏదో తండ్రి కదాయని ఓ వీడియో పంపింది. దాన్ని కాస్త సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేశాడు వర్మ. ఫలితంగా కూతురు ఆయనకు వార్మింగ్ ఇచ్చింది. అయినా లైట్ తీసుకున్నాడు వర్మ. ఇప్పుడు నిజంగానే వచ్చి నిన్ను తంతానంటోంది కూతురు రేవతి. అమెరికాలో ఉంటున్న రేవతి జిమ్ లో ఎక్సర్  సైజ్ లు చేస్తున్న ఒక వీడియోను తండ్రికి షేర్ చేయడమే ఇందుకు కారణం. 
          తన కూతురు తనను కొట్టడానికి ఎక్సర్ సైజ్ లు చేస్తోందని వర్మ కామెంట్లు పెట్టడం వివాదానికి దారి తీసింది. తాను చిన్నప్పుడు నేర్చుకున్న బ్రూస్ లీ ఎక్సర్ సైజ్ లను తిరిగి ప్రాక్టీస్ చేస్తున్నాను అంటూ మరో కామెంట్ పెట్టడం మరింత గొడవకు దారి తీసింది. ఎప్పుడూ వార్తల్లో నానే వర్మ ఈ సారి ఇలా తన కూతురు పైనా కామెంట్లు పెట్టడం, వీడియోలు షేర్ చేయడం నెటిజన్లకు ఇష్టం లేకపోయింది. అందుకే వర్మ తీరును అంతా తప్పుపడుతున్నారు. ఒక తండ్రిగా చేసే పని ఇదేనా అంటూ వర్మను తిట్టిపోస్తున్నారు. అయినా పెద్దగా పట్టించుకోవడం లేదు వర్మ.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*