కడియం పై మండిపడ్డ టీచర్స్ యూనియన్స్



Want create site? Find Free WordPress Themes and plugins.
ఉపాధ్యాయ సంఘాల పై హాట్ కామెంట్స్ చేసిన డిప్యూటీ సి.ఎం కడియం శ్రీహరి పై మండిపడుతున్నాయి ఆయా సంఘాలు. మొన్న హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి టీచర్ల తీరును తప్పు పట్టారు. మీ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లల్లో చదివిస్తున్నారు. మీరు మాత్రం ప్రభుత్వ స్కూళ్లల్లో పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇదేనా మీరు చేసేది అంటూ ప్రశ్నించారు. ఉపాధ్యాయ దినోత్సవం కోసం నాలుగు రోజుల తర్వాత నిర్వహించిన ప్రభుత్వ సన్మాన సభలో ఈ మాటలన్నారు నాయిని. ఆ మాటలు అనడమే ఆలస్యం దుమారం రేగింది. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఉపాధ్యాయులు. సన్మానిస్తామని పిలిచి ఇలా అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. ముందు మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపాలని కోరారు. 
         ఇప్పుడు విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అదే  తరహాలో ఉపాధ్యాయ సంఘాలను తిట్టిపోశాడు. తెలంగాణలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గొప్ప ఉపాధ్యాయ సంఘమని చెప్పారు. 70 ఏళ్ల చారిత్రక నేపధ్యమున్న ఈ సంఘం ఉపాధ్యాయులకు దిక్సూచిగా పనిచేస్తున్న చైతన్యవంతమైన సంఘమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అంతటితో ఆగితే సరిపోయేది. విద్యాశాఖలో టీచర్ల సంఘాలు అవసరానికి మించి ఏర్పడ్డాయి. సమస్యలు పరిష్కారం కాకుండా ప్రతిదానికి కేసులు వేస్తున్నారు. చిన్నదాన్ని పెద్దది చేస్తున్నారు. సమస్యను మరింత జఠిలం చేస్తున్నాయి సంఘాలు. గతంలో ఉపాధ్యాయ సంఘాలు విద్యావిధానంపై ప్రభుత్వానికి సూచనలు చేసేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు కడియం. కడియం మాటలను ఉపాధ్యాయ సంఘాలన్నీ సీరియస్ గా తీసుకున్నాయి. కడియంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందిస్తామని చెబుతున్నారు వాళ్లు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*