రోజా చేసిన తప్పు ఏంటంటే



Want create site? Find Free WordPress Themes and plugins.
రోజా ఏం చేసినా వివాదమే అవుతోంది. మంచి చేయాలనుకుంటోంది. కానీ అది రివర్స్ అయి తిరిగి తనకే ఇబ్బంది తెచ్చిపెడుతోంది. నగరి ఎమ్మెల్యే రోజా నంద్యాల, కాకినాడ ఎన్నికలు తరువాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటోంది. అదే సమయంలో నగరి ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. తన మాటల్లో మార్పు వచ్చింది. పెద్దగా హడావుడి చెయ్యడం లేదు. తన నియోజకవర్గానికే పరిమితం అయి ప్రజల వద్దకు వెళుతున్నారు. రోజా నగరిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ తర్వాత టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెప్పారు. చాక్‌పీస్ తీసుకుని బ్లాక్ బోర్డుపై “కలలు కనండి… సాకారం చేసుకొండి” అంటూ రాశారు… పిల్లలకి మంచి మాటలు చెప్పారు. సహజ దోరణికి భిన్నంగా రోజా ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 
                  రోజా ఒక చిన్న తప్పు చేశారు…. కలలు కనండి. సాకారం “చేసుకోండి” బదులు “చేసుకొండి” అని తెలుగులో తప్పుగా రాశారు. అది పట్టించుకోవాల్సినంత తప్పు కాదు. అయినా ప్రత్యర్థి వర్గానికి అది తప్పుగానే అనిపించింది. నోరు తెరిస్తే పప్పు, ఉప్పు అని సంబోధించే రోజా ఇలాంటి తప్పులు చేయవచ్చా అంటున్నారు. 
               అబ్దుల్ కలామ్ కలలు కనండి.. సాకారం చేసుకోండని చెబుతారు. ఆయన్ను అంతా ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. వాటిని నిజం చేసుకునేందుకు ప్రతి ఒక్క విద్యార్థి పాటు పడాలి. లక్ష్యం పెద్దది పెట్టుకోవాలని కోరారు రోజా. మీరు భవిష్యత్ లో ఏమవుతారు అని అడిగితే ఇంకా ఏం అనుకోలేదంటారు. అలా ఉండవద్దు. ఏదో ఒక లక్ష్యం అనుకోవాలి. డాక్టర్, ఇంజనీర్, టీచర్, పొలిటీషియన్ వంటి చాలా విభాగాల్లోకి అడుగు పెట్టవచ్చు. ఆ దిశగా అందరూ అడుగు పెట్టాలని రోజా కోరారు. ధైర్యంగా చట్టాలను అమలు చేసేలే మిగతా వారిని అడగాలంటే రాజకీయాల్లోకి రావాలని కోరారు రోజా. ఫలితంగా ఎన్నో అద్భుతాలు చేయవచ్చన్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*