తెలంగాణ విమోచన దినోత్సవం నేడే



Want create site? Find Free WordPress Themes and plugins.
తెలంగాణ నైజాం దాస్య శృంఖలాలను తెంచుకున్నరోజు సెప్టెంబర్ 17. శతాబ్దాలుగా నిజాం పాలనా కబంధ హస్తాల్లో నలిగిపోయిన తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిన రోజు. ఆగస్టు 15, 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ తెలంగాణ ఇంకా బానిస సంకెళ్ళతో అంధకారంలోనే ఉంది. దేశమంతా త్రివర్ణ జెండాలు ఎగురుతున్న వేళ.. తెలంగాణ ప్రజానీకం.. రజాకార్ల చేతుల్లో చిత్రహింసలకు గురైంది. తెలంగాణ సాయుధ పోరాటం అప్పటి నిజాంల గుండెల్లో గుబులు పుట్టించింది. రైతులు, కర్షకులు, కార్మికులు ప్రజలు బండెనక బండికట్టి గన్నులు చేతబట్టి సాగించిన ఈ మహాపోరాటం తెలంగాణకు విముక్తి కలిగేలా చేసింది. 
                        చివరిగా 1948 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది గడిచిన తర్వాత భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్యం చేశారు. భారత సైన్యంతో హైదరాబాద్ పై దండెత్తాడు. వారిద్దరి మధ్య జరిగిన పోరాటంలో ఎంతో మంది నిజాం సైన్యం, భారత సైనికులు నేలకొరిగారు. చివరకు నిజాం రాజు లొంగిపోక తప్పలేదు. ఆయన పాకిస్తాన్ కు వలసపోయాడు. అప్పుడు సెప్టెంబర్ 17.. తెలంగాణ నైజాం నుంచి భారత దేశంలో విలీనమైంది. రజాకార్ల ఆకృత్యాలు ఆగాయి. సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్య దినం.. విలీనం కాదు.. నిజాంల నుంచి విమోచనమే.
          ఈ సెప్టెంబర్ 17ను తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లిం ఓట్ల కోసం ప్రభుత్వం నిర్వహించకపోవడం పట్ల విమర్శలు తలెత్తాయి. అధికారంలోకి రాక ముందు కేసీఆర్ సర్కారు విమోచన దినోత్సవం జరపాలని గట్టిగా కోరింది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయింది. విపక్షాలన్నీ టీఆర్ఎస్ తీరును తప్పు పడుతున్నాయి. మరోవైపు బీజేపీ తెలంగాణ విమోచనోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*