రుణం తీసుకోండి..రూ. 10 వేలు క్యాష్ బ్యాక్ పొందండి



Want create site? Find Free WordPress Themes and plugins.
      ఫోన్ కొట్టు. గిప్టు పట్టు అని తెలుగు న్యూస్ చానల్ లో సరదగా వచ్చేకార్యక్రమం. ఫోన్ చేసి వారు అడిగిన ప్రశ్నకు సమాధాన చెబితే మంచి చీర బహుమతిగా వస్తోంది. ఇప్పడు అలానే ఉంది బ్యాంక్ ల ప్రకటన. మా బ్యాంకులో రుణం తీసుకోండి. రూ. 10 వేల క్యాష్ బ్యాక్ పొందండి. ఐసిఐసిఐ సరికొత్తగా చేసిన ప్రకటన ఇది. అంతేకాదు.. కొత్త పథకం కింద ఐసీఐసీఐ బ్యాంకు గృహరుణం పొందేవారితో పాటు, వేరే బ్యాంకులో ఉన్న రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకుకు బదిలీ చేసుకుంటే 20 శాతం రాయితీ ఇవ్వనుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డును వినియోగించి రూ.30,000 కొనుగోళ్లు జరిపిన వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 1 నుంచి నవంబర్‌ 30, 2017 వరకూ అందుబాటులో ఉంటుందని ఆ బ్యాంకు తెలిపింది. పండుగ సీజన్ కాబట్టి వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలాంటి పని చేసిందనేది అందరికీ తెలిసిన సత్యమే. 
      బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పెరిగిపోతుండటంతోనే ఐసిఐసిఐ ఈ పని చేస్తుందనే వాదన సాగుతోంది. ఇప్పుడు బ్యాంకులు తొందరగానే రుణాలిస్తున్నాయి. ఇందుకు కొన్ని షరతులు విధించింది. గృహరుణం పొందిన మూడు నెలల్లోగా క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు. ఒక కార్డుకు ఒకసారి మాత్రమే క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఈ పథకం అందుబాటులో ఉన్న సమయంలో గృహరుణం పొందటంతో పాటు, సదరు వినియోగదారుడు క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా రూ.30వేల లావాదేవీ జరపాల్సి ఉంది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకు.. వేతనం పొందే వారిలో మహిళలకు 8.35 శాతం, మిగిలిన వారికి 8.40శాతం వడ్డీకి గృహరుణాలను అందిస్తుండగా, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు 8.50శాతం, ఇతరులకు 8.55శాతం వడ్డీకి రుణాలను మంజూరు చేస్తోంది. 
       ఐసిఐసిఐ కి పోటీగా మిగతా జాతీయ, వాణిజ్య బ్యాంకులు ఎలాంటి ప్రకటనలు చేస్తాయో మరి. పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే వారి సంఖ్య తగ్గుతోంది. జిఎస్టీ వచ్చాక మరింతగా లావాదేవీలు తగ్గాయి. అందుకే ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయంటున్నారు. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*