చంద్రబాబును కలిసిన స్టాన్ పోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్



Want create site? Find Free WordPress Themes and plugins.
       నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు స్టాన్ పోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కార్తీక్ మిక్కినేని.  ఆ యూనివర్సిటీలో హెల్త్ కేర్ విభాగంలో సేవలందిస్తున్న కార్తీక్ స్వస్థలం గుంటూరు జిల్లా బ్రాడీపేట. ఆంధ్రుల నగరి అమరావతిలో వైద్య, ఆరోగ్య రంగం అభివృద్ధికి స్టాన్ పోర్డ్ యూనివర్సిటీకి మధ్య వారధిగా ఉండాలని సి.ఎం చంద్రబాబు ఆకాంక్షించారు. భవిష్యత్ లో ఆ దిశగా పావులు కదపాలని…అలాంటి సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక సిద్దం చేయాలని కార్తిక్ మిక్కినేనికి సూచించారు చంద్రబాబు. 
       అమెరికాలోని ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో సీటు రావడమే అదృష్టం. అయితే ఏకంగా ఈ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించే అవకాశం దక్కడంతో తెలుగు వారికే కాదు…దేశానికే గర్వకారణం. ప్రపంచంలో పేరుపొందిన విశ్వవిద్యాలయాల్లో స్టాన్‌ఫోర్డు యూనివర్శిటీ ఒకటి. ఈ యూనివర్శిటీలో సీటు కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రపంచంలోనే వైద్యవిద్యకు ఎంతో ప్రఖ్యాతిగాంచిన స్టాన్‌ఫోర్డు విశ్వవిద్యాలయం (స్టాన్‌ఫోర్డు మెడిసిన్‌)లో సహాయ ఆచార్యుడిగా పనిచేసే అదృష్టం గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి డాక్టర్‌ మిక్కినేని కార్తీక్‌కు దక్కింది. గుంటూరు వైద్య కళాశాలలో 2004-10 మధ్య ఎంబిబిఎస్ పూర్తి చేసిన కార్తీక్ సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు చేయటానికి 2012లో అమెరికా వెళ్లారు. అమెరికాలోని న్యూయార్క్ విల్ కార్నెల్ మెడికల్ కాలేజిలో చేరిన కార్తీక్ అక్కడే ఏడాది పాటు వైద్య విద్యనభ్యసించాడు. ఆ తర్వాత పెన్సులేనియాలోని పిట్స్ బర్గ్ మెడికల్ యూనివర్సిటీకి మారాడు. 2012 నుంచి 2016 దాకా న్యూయార్క్‌లోని ఫిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో ‘వాస్‌క్యూలర్‌ సర్జరీ’ ఎండీ విద్యను పూర్తి చేశారు. ఆ యూనివర్సిటీలో  వ్యాస్కులర్ పిజీ సర్జరీ పూర్తి చేసిన తొలి అమెరికాయేతరుడు కార్తీక్ మిక్కినేని ఒక్కరే. ఇలాంటి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న తెలుగువాడైన కార్తీక్ ను అభినందించారు సిఎం చంద్రబాబు.
        అమరావతిలో అన్ని వసతి సౌకర్యాలు ఉన్న మంచి హాస్పటల్ పెట్టాలనేదే తన ఆశయమని చెప్పారు డాక్టర్ కార్తీక్ మిక్కినేని. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*