బిగ్ బాస్ లో మిగిలిందెవరంటే



Want create site? Find Free WordPress Themes and plugins.
ఉత్కంఠకు తెరపడింది. బిగ్ బాస్ షో నుంచి దీక్ష ఎలిమినేట్ అయింది. ఇక మిగిలింది శివబాలాజీ, నవదీప్, హరితేజ, ఆదర్శ్, అర్చనలు. చివరి వారం ఎవరు కెప్టెన్ గా ఉంటారనే విషయంలో నిర్ణయాన్ని బిగ్ బాస్ ఎన్టీఆర్ చేతిలో పెట్టారు. ఫలితంగా అర్చనను కెప్టెన్ గా నియమించారు ఎన్టీఆర్. చివరి వారం కావడంతో వారిలో ఎవరు సీజన్ -1 విజేత అవుతారో ఆదివారం తేలనుంది. ఓటింగ్ లో తక్కువ ఓట్లు రావడంతోనే దీక్షను ఎలిమినేట్ చేశారు. వెళుతూ వెళుతూ బిగ్ బాంబ్ ను అందరి పైనా వేసి వెళ్లారు దీక్ష. గంట మోగినప్పుడు సభ్యులంతా ఎక్కాలు చదవాల్సి ఉంటోంది. బిగ్ బాస్ షో పార్టిసిపెంట్స్ లో పర్ పెక్ట్ బాయ్ ఆదర్శ్ అని చెప్పారు దీక్ష. అలానే చాలా సున్నితమైన మనిషి అని ప్రకటించారు. 
          ఇక అర్చన చాలా సెల్ఫిష్ అని, శివబాలాజీ తాను చెప్పిందే చేస్తాడని స్టబర్న్ అని, నవదీప్ డబుల్ మీనింగ్ డైలాగ్ లు వేస్తాడని, హరితేజను నమ్మలేమని చెప్పింది దీక్ష. ఎవరు గెలుస్తారంటే మాత్రం. అందరికీ బెస్టాప్ లక్ అని చెప్పేసి వెళ్లింది దీక్ష. 
         దానికి ముందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌవుస్ లో మటన్ బిర్యానీ వండి పెట్టారు. మటన్ ఎలా తయారు చేయాలి. బిర్యానీ ఎలా వండాలి. చెట్నీ ఎలా తయారు చేయాలి. ఏ మోతాదులో వేయాలనే విషయాన్ని ఆడపడుచులకు చాలా జాగ్రత్తగా చెప్పి మరీ తయారు చేశాడు. ప్రముఖ చెఫ్ లు ఎలా అయితే చెప్పి మరీ వండి వారుస్తారో అలా చేసి చూపించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ లో ఈ కళ కూడ ఉందా అనిపించింది. ఇది చాలా ఆకట్టుకుంది. ప్రతి ఆదివారం తాను ఇంట్లో వంట వండటానికి ప్రయత్నిస్తానని ఎన్టీఆర్ చెప్పడంతో అవునా అంటూ అంతా చర్చించుకోవడం కనిపించింది. 
       ఇప్పుడు బిగ్ బాస్ లో మిగిలిన ఐదుగురిలో ఒకరు విజేత అవుతారు. వారి కోసం అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. బయట నుంచి ప్రత్యేకంగా డబ్బులు, వాయిద్యాలు తెచ్చి మరీ వాయించడం విశేషం. చిన్న చిన్న విషయానికే అలిగి అందరితో గొడవ పడే దీక్షను పంపించేయడంతో హౌవుస్ లో ఉన్న సభ్యులు మరింత ఉత్సాహంగా చిందులు తొక్కారు.   
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*