పురందేశ్వరి ఆలోచనల్లో మార్పు వచ్చిందా…



Want create site? Find Free WordPress Themes and plugins.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. సి.ఎం చంద్రబాబు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి విషయంలో ఇదే జరుగుతోంది. ఇన్నాళ్లు నారా, దగ్గుబాటి కుటుంబాలు కలి ‘విడి’గా ఉంటున్నాయి. చంద్రబాబు విధానాలను తూర్పారబట్టిన పురందేశ్వరి తన రూటు మార్చుకున్నారు. ఏపీలో మా మిత్ర పక్షం అధికారంలో ఉంది. కేంద్రం ఆ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయం అందిస్తుందని చెప్పారు. టీడీపీ విషయంలో కేంద్రం తీరు మారాకనే పురందేశ్వరి ఆలోచన మారిందంటున్నారు. నిన్నటి వరకు చంద్రబాబు ప్రభుత్వ పాలన తీరును తప్పు పట్టారు పురందేశ్వరి. ఇప్పుడు ఆ పని చేయక పోగా మా మిత్రపక్షం అని చెబుతున్న తీరు రాబోయే కాలంలో బీజేపీ, టీడీపీ పొత్తులను మరింత పటిష్టం చేస్తుందని చెబుతున్నారు. 
                    గుంటూరు, నరసరావుపేటలలో ఒక చోటు నుంచి పోటీ చేసే ఆలోచన చేస్తున్నారు ఎన్టీఆర్ పుత్రిక అయిన దగ్గుబాటి పురందేశ్వరి. కానీ అది అంత తేలికగా వచ్చే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఆ సీటు ఆశించిన పురందేశ్వరికి అప్పటి కాంగ్రెస్ పార్టీ వైజాగ్ ను కేటాయించింది. అక్కడ గెలిచి… ఆ తర్వాత బీజేపీలో చేరి రాజంపేటలో పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ పార్టీని పూర్తిస్థాయిలో పటిష్ఠం చేసుకోకపోవడం, ముందే సీటు ఇవ్వడం వంటి కారణాలతో ఆమె పరాజయం పాలయ్యారు. అందులోను రాయలసీమతో సంబంధం లేని ఆమె అక్కడ పోటీ చేయడంతో ఓటర్లు తిప్పికొట్టారనేది కూడా ఉంది.
                      ఆశ్చర్యం ఏంటంటే కడప జిల్లాకు చెందిన దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ సొంతజిల్లాని వదిలి వైజాగ్ లో పోటీ చేస్తే…పురందేశ్వరి వైజాగ్ ను వదిలి కడప జిల్లా రాజంపేటలో పోటీకి దిగడం.. చివరకు ఇద్దరికీ అపజయమే ఎదురవడం తెలిసిందే. ఇప్పుడు పురందేశ్వరి చంద్రబాబుతో కలిసి పోయేందుకు సిద్ధమయ్యారంటున్నారు. ఇందుకు తెర వెనుక లోకేష్ పావులు కదిపారని తెలుస్తోంది. కానీ ఇందుకు బాబు సతీమణి, పురంధేశ్వరి సోదరి భువనేశ్వరి ఒప్పుకుంటారా లేదా అనే చర్చ లేకపోలేదు. మొత్తంగా తిరిగి ఎన్టీఆర్ కుటుంబం అంతా టీడీపీలోకి వచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*