చంద్రుసీఎంల పై విరుచుకుపడ్డ నారాయణ



Want create site? Find Free WordPress Themes and plugins.
ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనుకునే రకం నేత సిపిఐ నాయకుడు నారాయణ. మొన్నీ మధ్య వైజాగ్ కు వెళ్లి అక్రమార్కులు ఆక్రమించిన భూమిలో కాలు పెట్టారు. అంతటితో ఆగితే సరిపోయేది. తన కాలును గడ్డపలుగులా వాడారు. అంతే మంచానా పడాల్సి వచ్చింది. అడ్డంగా కట్టిన ఓ దిమ్మెను తన్నబోయి తన కాలును దాంట్లో ఇరికించుకున్నారు. ఎరక్క పోయి ఇరుక్కుని ఆసుపత్రికి వెళ్లారు. అప్పటి నుంచి మీడియాకు కాస్త దూరంగా ఉంటు వస్తున్న నారాయణ ఇప్పుడు మళ్లీ హడావుడి చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ సి.ఎం.ల తీరును తప్పుపట్టారు.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి విషయంలో ఏపీ చంద్రబాబు వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపట్టారు నారాయణ. అమరావతి డిజైన్లలో టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి సూచనలు పాటిస్తానని బాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు నారాయణ.
     చంద్రబాబు గ్రాఫిక్స్‌కే పరిమితమవుతున్నారని, అయితే ఆ ఊహాప్రపంచాన్ని విడనాడాలని ఏపీ సీఎంకు నారాయణ సూచించారు. తెలుగువారు అలా కాకపోతే మన దేశంలోనే అత్యున్నత స్థాయి నిపుణులున్నారని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. వారిని కాదని… సింగపూర్‌ ఎందుకు వెళ్తున్నారని నారాయణ ప్రశ్నించారు. 
                 తెలంగాణ సాయుధ పోరాటాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు అధికారికంగా నిర్వహించడం లేదో చెప్పాలన్నారు. ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ లొంగిపోయారని నారాయణ మండిపడ్డారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. దాన్ని కేసీఆర్ జరపక పోవడం విచిత్రంగా ఉందన్నారు. ఓట్ల రాజకీయాలను ఇకనైనా కేసీఆర్ మానుకోవాలన్నారు నారాయణ. గరగపర్రు దళితులను పరామర్శించే తీరిక ఏపీ సీఎం చంద్రబాబుకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోవైపు విమర్శించారు. 50 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్య చంద్రబాబుకు ఎందుకు పట్టదని ఆయన ప్రశ్నించారు.
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*