తెలంగాణ‌లో కేసీఆర్ మొక్క‌కు ఇలాంటి దుస్థితా?Want create site? Find Free WordPress Themes and plugins.
 
 
     
           ఎప్పుడు దేని మీద తెలంగాణ‌రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఫోక‌స్ పెడ‌తారో ఆయ‌న స‌న్నిహితులు సైతం చెప్ప‌లేరు. అయితే.. ఆయ‌న తీసుకునే ప్ర‌తి నిర్ణ‌యం వెనుక మాత్రం ఒక లెక్క అయితే ప‌క్కాగా ఉంటుంద‌ని చెప్పాలి. ప‌చ్చ‌ద‌నం కోసం హ‌రిత‌హారం పేరిట భారీ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌ట‌మే కాదు.. దాన్నో ఉద్య‌మంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన ఘ‌న‌త కేసీఆర్‌కు ద‌క్కుతుంది.

         ఈ కార్య‌క్ర‌మం కోసం వంద‌లాది కోట్ల రూపాయిల్ని ఖ‌ర్చు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప‌చ్చ‌ద‌నాన్ని పెంచ‌ట‌మే లక్ష్యంగా ముందుకెళ్లే ఈ ప‌థ‌కంలో భాగంగా ముఖ్య‌మంత్రి మొద‌లు సామాన్యుల వ‌ర‌కూ అంద‌రూ పాల్గొనేలా చేశారు కేసీఆర్‌. అయితే.. ఇదెంత వ‌ర‌కూ స‌క్సెస్ అయ్యింద‌న్న‌ది సందేహ‌మే. దాన్ని నిజం చేసే ఉదంతం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

             ఉత్సాహంగా చెట్ల‌ను నాట‌టంతోనే ప‌ని పూర్తి కాద‌ని.. దాన్ని కొంత‌కాలంగా జాగ్ర‌త్త‌గా పెంచాల్సిన బాధ్య‌త ఎవ‌రికి వారి మీద ఉంద‌ని.. నాటిన మొక్క‌ల విష‌యంలో.. వాటి పెంప‌కంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం కీల‌కం. అయితే.. మొక్క‌లు నాటించేట‌ప్పుడు ఉండే ఉత్సాహం.. నాటిన మొక్క మీద చూపించ‌టం లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు త‌గ్గ‌ట్లే తాజాగా సీఎం కేసీఆర్ స్వ‌యంగా త‌న చేతుల‌తో ఒక మొక్క‌ను నాటారు. దాన్ని సంరక్షించాల్సిన అట‌వీశాఖాధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌టంతో.. చివ‌ర‌కు ఆ మొక్క ఎండిపోయింది.

            క‌రీంన‌గ‌ర్ జిల్లా మానేర్ క‌ట్ట దిగువ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌హాఘ‌ని మొక్క‌ను నాటారు. అయితే.. దాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌టంతో అది కాస్తా వాడిపోయింది. దీంతో.. మొక్క‌ను బ‌తికించేందుకు అధికారులు కిందామీదా ప‌డుతున్నారు. అయితే.. ఈ మొక్క వాడిపోవ‌టానికి కొంద‌రు యువ‌కులు కార‌ణంగా చెబుతున్నారు.

         ఈ మ‌ధ్య‌న కొంద‌రు యువ‌కులు ఈ చెట్టు వ‌ద్ద‌కు వ‌చ్చి ఏదో చేశార‌ని.. వెళ్లి ప్ర‌శ్నిస్తే త‌న‌ను తిట్టేశార‌న్నారు.  ఆ త‌ర్వాత రోజు నుంచి ఆ మొక్క క్ర‌మంగా వాడిపోవ‌టం మొద‌లైంద‌ని.. తిరిగి మొక్క‌ను బ‌తికించేందుకు అధికారులు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లించ‌టం లేద‌ని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ నాటిన మొక్క ప‌రిస్థితే ఇలా ఉంటే.. మిగిలిన వారు నాటిన మొక్క‌ల ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.

Did you find apk for android? You can find new Free Android Games and apps.Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*