గుత్తాను రాజీనామా చేయాలన్న కేసీఆర్ 



Want create site? Find Free WordPress Themes and plugins.
 
       నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వారం రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేస్తారట. ఈ మేరకు సి.ఎం కేసీఆర్ నుంచి ఆయనకు సంకేతాలు వచ్చాయంటున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఈ ఉప ఎన్నిక జరుపుతారా లేదా అనే సందేహాలు ఉన్నాయి. కొందరు మంత్రులు ,టిఆర్ఎస్ నేతలు అదే మాట చెబుతున్నా…ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం గుత్తా రాజీనామాకే సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది. మన సత్తా చూపించాలంటే గుత్తా రాజీనామానే మందు. అందుకే రాజీనామా చేయాలని చెప్పారట. మంత్రి కేటిఆర్ తోపాటు…ఒకరిద్దరు ఉప ఎన్నిక వస్తే ఎన్నికల కోడ్ తో అభివృద్ధి పనులు ఆగుతాయేమోనని అనుమానం వ్యక్తం చేశారట. అయినా ఉప ఎన్నికలో గెలవడం ద్వారా కాంగ్రెస్ కు జవాబు ఇవ్వాలని చెప్పారు కేసీఆర్. ఈ గెలుపు సాధారణ ఎన్నికలకు ఊపు తెస్తుందని..అందుకే సిద్దం కావాలని చెప్పారట. గుత్తాకు రైతు సమన్వయ చైర్మన్ పదవి ఇవ్వడానికి అంతా సిద్దమయ్యారు. కానీ ఆ ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు నెలలు పట్టవచ్చని చెబుతున్నారు.
      మరోవైపు టీడీపీ నుంచి ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నల్గొండలో పోటీకి దిగనున్నారు. కాంగ్రెస్ సరైన అభ్యర్థిని పోటీకి దింపే ఆలోచన చేస్తోంది. పైకి కాంగ్రెస్ పోటీ పెట్టినా టీడీపీ నేతకు మద్దతు పలికే అవకాశముందంటున్నారు. విపక్షాలన్నీ ఏకమై రేవంత్ రెడ్డికి మద్దతు పలికితే గులాబీ నేత గెలవడం కష్టమే. 
Did you find apk for android? You can find new Free Android Games and apps.



Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*